Aditya N
యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898AD' అనే బిగ్ బడ్జెట్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కల్కి 2898 AD సినిమా పోస్ట్ పోన్ అయిందేమో అని అభిమానులు కంగారుపడ్డారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలిసింది.
యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898AD' అనే బిగ్ బడ్జెట్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కల్కి 2898 AD సినిమా పోస్ట్ పోన్ అయిందేమో అని అభిమానులు కంగారుపడ్డారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలిసింది.
Aditya N
యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898AD’ అనే బిగ్ బడ్జెట్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. మే9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు కాబట్టి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా చెప్పిన డేట్ కి వస్తుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.
నిజానికి ఈ ఏడాది మార్చి నుంచి కల్కి మేకర్స్ ప్రమోషన్ మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులని కూడా నిరాశపరుస్తూ ఎలాంటి ప్రమోషన్ కూడా స్టార్ట్ కాలేదు. అయితే శివరాత్రి పండుగ సందర్భంగా హీరో క్యారెక్టర్ పేరు ” భైరవ ” అని ప్రకటిస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఆ పిక్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో కల్కి 2898 AD సినిమా పోస్ట్ పోన్ అయిందేమో అని అభిమానులు కంగారుపడ్డారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలిసింది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీని మార్చి నెలాఖరు నుంచి స్టార్ట్ చేయనునట్లు తెలుస్తోంది.
ఆ రకంగా మార్చి ఎండ్ నుంచి మే వరకూ ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయడానికి కల్కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. మరి ఈసారైనా కేవలం రూమర్స్ కాకుండా నిజంగా సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ మొదలవుతే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కు ఇండియన్ మైథాలజికల్ ఎలిమెంట్స్ కలిపి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కల్కి 2898 AD: మార్చ్ టు మే ప్రమోషన్స్