iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న దేవర సర్ ప్రైజ్.. రెండ్రోజులు ముందుగానే..

Jr NTR Devara Part 1 Fear Song: తెలుగు ప్రేక్షకులే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా అభిమానులు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఫ్యాన్స్ కి బూస్ట్ ఇస్తూ ఒక అప్ డేట్ తీసుకొచ్చారు.

Jr NTR Devara Part 1 Fear Song: తెలుగు ప్రేక్షకులే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా అభిమానులు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఫ్యాన్స్ కి బూస్ట్ ఇస్తూ ఒక అప్ డేట్ తీసుకొచ్చారు.

ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న దేవర సర్ ప్రైజ్.. రెండ్రోజులు ముందుగానే..

జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ గ్లోబల్ స్టార్ గురించే చర్చ జరుగుతోంది. తెలుగు ఆడియన్స్ అయితే ఈ దేవర కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అంతా దేవర మూవీ రిలీజ్ కాకుండా.. దాని నుంచి వచ్చే అప్ డేట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి కోరికలకు తగినట్లుగానే దేవర టీమ్ ఒక మంచి అప్ డేట్ ప్లాన్ చేసింది. మే 19న ఒక సాంగ్ వస్తుందని ప్రకటించారు. అయితే అనుకున్న దానికంటే ముందే ఫ్యాన్స్ కి అనిరుధ్ గిఫ్ట్ ఇచ్చాడు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఈ దేవర సినిమా గురించి అంచనాలు పెరిగిపోయాయి. అందుకే దేవర టీమ్ కూడా వాటిని ఏమాత్రం తగ్గించకుండా గట్టిగానే ప్లాన్ చేస్తోంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ వస్తుందని ప్రకటించారు. ‘ఆల్ హెయిల్ ది టైగర్ అనే ఫియర్ సాంగ్’ని మే 19న విడుదల చేయబోతున్నారు. తారక్ పుట్టిన రోజు కాబట్టి ఫ్యాన్స్ కి ఫస్ట్ సింగిల్ ఇచ్చి ఖుషీ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. అయితే దానికంటే రెండ్రోజుల ముందే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చిన్న సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అదేంటంటే.. ఫియర్ సాంగ్ కి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ ని విడుదల చేశారు. చిన్న గ్లింప్స్ కో ఇంత బిల్డప్పా అని అనుకోకండి. ఎందుకంటే దేవర నుంచి వచ్చే ఏ అప్ డేట్ అయినా ఇప్పుడ ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి. అలాంటి పండగను అనిరుధ్ ఫ్యాన్స్ కి అందించాడు. ఈ ఆల్ హెయిల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతోందో.. ఈ గ్లింప్స్ చూస్తే క్లారిటీ వచ్చేసింది. మే 19న సాంగ్ విడుదలైతే మాత్రం రికార్డులు అన్నీ బద్దలు కొడతాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ఒకెత్తు.. ఈ సాంగ్ ఒకెత్తు అనే చెప్పాలి. అనిరుధ్ జైలర్ కంటే కూడా ఈ సాంగ్ పై చాలా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. చిన్న గ్లింప్స్ వల్లే ఈ రేంజ్ ఇంపాక్ట్ అంటే ఇంక మే 19న ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆ ఫీలింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరి.. దేవర పార్ట్ 1 ఫస్ట్ పాట ఫియర్ సాంగ్ ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి