కొన్నిసార్లు సినిమాలు విడుదల అయ్యాక ఆ సినిమాలకు సంబంధించి వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నేమో రిలీజ్ ముందే ఫలానా టాపిక్ టచ్ చేశారంటూ విమర్శలు మొదలవుతాయి. కానీ.. సినిమాలు తీసేవారు అవేవి చూడరు. ఒక పాయింట్ పై చర్చించాలని అనుకుంటే దానిపైనే సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటారు. వివాదాల సంగతి తర్వాత.. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కించిన ‘బవాల్’ మూవీ అలాంటి వివాదంలో ఇరుక్కుందని చెప్పాలి. బాలీవుడ్ యంగ్ స్టర్స్ వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా.. గతవారం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్నప్పటికీ ఓ వివాదం తెరపైకి వచ్చింది.
యాక్షన్ తో పాటు యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బవాల్ ని రూపొందించారు. అయితే.. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ వివాదాలకు దారితీస్తున్నాయి. సినిమాలో `ఆష్విట్జ్` క్యాంపులను చూపించడమే అందుకు కారణం. ఆష్విట్జ్ లోని పరిస్థితులను చూపిస్తూ.. ఆ సీన్లపై అభ్యంతరం తెలపడం పట్ల తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యింది. ప్రేక్షకులు సినిమాలోని మెయిన్ పాయింట్ ని అర్ధం చేసుకోవాలని.. అసలు మ్యాటర్ వదిలేసి వేరే యాంగిల్ లో సినిమా చూస్తే తాము ఏం చేయలేం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ మాటలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి.
జాన్వీ మాట్లాడుతూ.. మా బవాల్ సినిమా చూసి ఇజ్రాయిల్ కి చెందిన ఓ ప్రొఫెసర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెబుతూ.. సినిమా పట్ల ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని చెప్పింది. ఏదైనా చూసే కోణంలోనే ఉంటుందని జాన్వీ కామెంట్స్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్ లో జరిగిన అల్లకల్లోలాన్ని చూపించడమే తమ సినిమా ఉద్దేశ్యమని.. మీరు మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏం చేయలేమని తెలిపింది జాన్వీ. అనంతరం సినిమా వివాదం గురించి డైరెక్టర్ నితీష్ కూడా స్పందించారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో జాన్వీ మతులు పోగొడుతున్న జాన్వీ.. దేవర మూవీతో తెలుగు డెబ్యూ చేయనున్న సంగతి తెల్సిందే. మరి జాన్వీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.