iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ లాల్ సలామ్ అక్కడ విడుదల కాదా?

  • Published Feb 03, 2024 | 12:13 PM Updated Updated Feb 03, 2024 | 12:13 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది మరియు ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది మరియు ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

  • Published Feb 03, 2024 | 12:13 PMUpdated Feb 03, 2024 | 12:13 PM
రజినీకాంత్ లాల్ సలామ్ అక్కడ విడుదల కాదా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది మరియు ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. నిజానికి ఈ సినిమాలో రజినీది ప్రధాన పాత్ర కాదు.. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే ఒక ముఖ్యమైన పాత్రలో ఆయన కనిపిస్తారు. అయితే విడుదలకు ముందు, ఈ. చిత్ర బృందానికి పెద్ద సమస్య ఎదిరుపడింది. లాల్ సలామ్ సినిమా కువైట్‌లో విడుదల కాదు. సున్నితమైన అంశాల కారణంగా ఈ. చిత్రం అక్కడి స్థానిక సెన్సార్ బోర్డు ద్వారా నిషేధించబడింది.

స్థానిక క్రికెట్ మ్యాచ్ కారణంగా సాగే హిందూ, ముస్లిం పోరాటాల సెన్సిటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిడిల్ ఈస్ట్‌లో, ఈ రకమైన కథలతో తెరకెక్కిన సినిమాలు సెన్సార్‌ ను క్లియర్ చేయడం చాలా కఠినమైనది, ఎందుకంటే వారు ఏదైనా నిర్దిష్ట మతానికి, వర్గానికి లేదా దేశానికి వ్యతిరేకంగా తయారు చేయబడిన చిత్రాలను అనుమతించరు. ఇటీవలే హృతిక్ రోషన్ యొక్క ఫైటర్ సినిమా. కూడా పాకిస్తాన్ వ్యతిరేక అంశాల కారణంగా మొత్తం మిడిల్ ఈస్ట్‌లో నిషేధించబడింది. ఇప్పుడు కువైట్‌లో లాల్ సలామ్ కూడా నిషేధించబడింది. మరి చిత్ర బృందం విడుదలకు ముందే సన్నివేశాల్లో ఏమైనా మార్పు తీసుకు వస్తుందో లేదా మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ లో కూడా మొత్తంగా నిషేధించబడుతుందో చూడాలి.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సూపర్ స్టార్ ఒక ముఖ్యమైన అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ విష్ణు రంగసామి, ఎడిటర్ ప్రవీణ్ బాస్కర్ ఉన్నారు.