Chiranjeevi
రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌లో కూతురు సెంటిమెంట్, అయ్యప్ప భక్తి, ఆడపిల్లల రక్షణ వంటి బలమైన అంశాలు కనిపిస్తున్నాయి. అన్ని హుక్ పాయింట్లు కలిసి రవన్నకు హిట్ తెచ్చేలా ఉన్నాయా?
రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌లో కూతురు సెంటిమెంట్, అయ్యప్ప భక్తి, ఆడపిల్లల రక్షణ వంటి బలమైన అంశాలు కనిపిస్తున్నాయి. అన్ని హుక్ పాయింట్లు కలిసి రవన్నకు హిట్ తెచ్చేలా ఉన్నాయా?
Chiranjeevi
సినిమాకు హిట్ ఫార్ములా అంటూ ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. కానీ హిట్ కావడానికి దోహదం చేసే అంశాలు ఏమిటో కొంత వరకు సినిమా జనాలకు అవగాహన అయితే వుంటుంది. అలాంటి అంశాలు అన్నీ ముప్పేట ముడి వేసే సినిమా తీస్తే, హిట్ కు దగ్గరగా వెళ్తుంది అనే భరోసా వుంటుంది. అలాగే అనిపిస్తోంది రవితేజ లేటెస్ట్ సినిమా ఇరుముడి ట్రయిలర్ చూస్తుంటే.
కూతురు సెంటిమెంట్ అన్నది బలమైన హుక్ పాయింట్. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. అది దృశ్యం సిరీస్ అయినా, భగవంత్ కేసరి అయినా, మరే సినిమా అయినా. దేవుడు అన్నది మరో హుక్ పాయింట్. అందులోనూ అయ్యప్ప భక్తి. చాలా కాలం అయితే సరైన పెద్ద సినిమా అయ్యప్ప భక్తి తో ముడిపడిన సబ్జెక్ట్ తో. ఇది రెండో హుక్ పాయింట్. ఆడపిల్లల రక్షణ అన్నది మరో హుక్ పాయింట్. ‘తేడా వస్తే తాట తీసి పేగులు తీసేస్తాం’ అనే భయం వుంటే తప్ప ఆడపిల్లలను పెంచలేం అనే ఒక్క డైలాగు చాలు సినిమా సబ్జెక్ట్ ఏ మేరకు జనాలను ఆకట్టుకోబోతోందో అన్నది అంచనా వేయడానికి.
ఇలాంటి పాయింట్లు అన్నీ గుదిగుచ్చి కథ అల్లుకున్నట్లున్నారు దర్శకుడు శివ నిర్వాణ. జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం బలంగా నిలబడింది. చాలా పాపులర్ అయిన అయ్యప్ప గీతాలు సినిమాలోకి తీసుకురావడం ఇంకా ప్లస్ అయింది. ఇలా మొత్తం మీద అన్ని విధాల ట్రయిలర్ ఆకట్టుకునేలా వుంది. చాలా రోజులుగా హిట్ కోసం చూస్తున్న రవితేజకు హిట్ పడేలాగే వుంది.