iDreamPost
android-app
ios-app

‘లక్కీ’ తెచ్చిన లక్

‘లక్కీ భాస్కర్’ సితార సంస్థకు ఓటీటీ మార్కెట్‌లో పెంచిన నమ్మకం ఇప్పుడు మరో సినిమాకు భారీగా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వనాధం అండ్ సన్స్’కు రూ.81 కోట్ల ఓటీటీ డీల్ సెట్ అయినట్లు సమాచారం.

‘లక్కీ భాస్కర్’ సితార సంస్థకు ఓటీటీ మార్కెట్‌లో పెంచిన నమ్మకం ఇప్పుడు మరో సినిమాకు భారీగా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వనాధం అండ్ సన్స్’కు రూ.81 కోట్ల ఓటీటీ డీల్ సెట్ అయినట్లు సమాచారం.

‘లక్కీ’ తెచ్చిన లక్

ఒకసారి మంచి ఇమేజ్ సంపాదిస్తే దాని ఫలితం తరువాత తరువాత ఇంకా బాగా వుంటుంది. లక్కీ భాస్కర్ అనే సినిమా సితార సంస్థకు ఓటిటి సంస్థల దగ్గర అలాంటి ఇమేజ్ ను సంపాదించిపెట్టింది. సితార సంస్థ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, రెండో మాట లేకుండా నెట్ ఫ్లిక్స్ తీసుకుంటోంది అంటే కారణం వాటి కంటెంట్ మీద నమ్మకం. ఈ నమ్మకాన్ని లక్కీ భాస్కర్ అనే సినిమా మరింత పెంచింది. ఎంత పెంచింది అంటే ఓటిటి అమ్మకాలు ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో విశ్వనాధం అండ్ సన్స్ సినిమాకు 81 కోట్ల ఓటిటి డీల్ సెట్ అయ్యేంతగా.

ఓ మిడ్ రేంజ్ తెలుగు సినిమాకు ఇంత భారీ డీల్ అన్నది ఇటీవలి కాలంలో తెలియనిది. భారీ కాంబినేషన్, మల్టీ స్టారర్ సినిమాలకు కూడా ఈ రేటు రావడం లేదు. అలాంటిది విశ్వనాధం సన్స్ కు ఈ రేటు రావడానికి కారణం సింపుల్..లక్కీ భాస్కర్ అందించిన వెంకీ అట్లూరి దర్శకుడు కావడం. సూర్య హీరో కావడం. తెలుగు, తమిళ, మలయాళ ఇలా అన్ని భాషల్లో సూర్య బాగా పరిచయం. ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇవన్నీ కలిసి ఈ సినిమాకు మంచి రేటు తీసుకువచ్చాయి.

ఈ ఒక్క సినిమా మీద సితార సంస్థకు ముఫై కోట్లకు పైగా లాభం మిగిలిందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. రెండు వందల కోట్లతో సినిమా తీసినా అయిదారు కోట్లు మిగలని ఈ రోజుల్లో ఓ మిడ్ రేంజ్ సినిమా మీద ఇంత మిగలడం అంటే షాకింగ్ నే.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetromabet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet