iDreamPost
android-app
ios-app

మరోసారి దేవలోకం ఫాంటసీ

అల్లరి నరేష్ నటిస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. దేవలోకం ఫాంటసీ, కామెడీ కలయికతో వస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తిని పెంచేలా ఉంది.

అల్లరి నరేష్ నటిస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. దేవలోకం ఫాంటసీ, కామెడీ కలయికతో వస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తిని పెంచేలా ఉంది.

మరోసారి దేవలోకం ఫాంటసీ

దేవలోకం ఫాంటసీ అన్నది ఎప్పుడూ జనాలకు ఆసక్తి కరమే. యమగోల నుంచి యమలీల వరకు టైటిల్ ఏదైనా రంభ..ఊర్వశి..మేనక లేకుండా సక్సెస్ లేదు. అయితే ఈ సబ్జెక్ట్ ను పక్కన పెట్టి చాలా కాలం అయింది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ను తీసుకుని మళ్లీ వినోదం పండించడానికి రెడీ అయ్యారు అల్లరి నరేష్. హాస్య మూవీస్, అన్నపూర్ణ సంస్థల సమర్పణలో రంభ ఊర్వశి మేనక అనే సినిమాను చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.

స్మార్ట్ ఫోన్ కు వుండే పాట్రన్ లాక్ లాంటిది వుంటుంది ఒక మ్యాజిక్ బుక్ కు. అది సాల్వ్ చేయగలిగితే స్వర్గం నుంచి రంభ..ఊర్వశి..మేనక దిగి వచ్చి వరాలు ఇస్తారనే నమ్మకంతో పెరుగుతాడు ఓ కుర్రాడు. ఈ కుర్రాడి వల్ల ఆ స్వర్గాధిపతికి ఎన్ని చిక్కులు…రంభ ఊర్వశి..మేనక దిగి రావడం వల్ల ఈ కుర్రాడికి ఎన్ని ఇబ్బందులు అన్నది ఫన్నీ వే లో చిత్రీకరించారు.

మోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ రంభ, ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించారు. సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు ఫన్ క్యారెక్టర్లలో కనిపించారు.

వేరే బ్యానర్ తో కలిసి అన్నపూర్ణ సంస్థ సినిమా నిర్మించడం ఇది రెండోసారి. ఇటీవల లెనిన్ సినిమా నిర్మించారు. ఇప్పుడు రంభ ఊర్వశి మేనక నిర్మిస్తున్నారు.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetslotday girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet