Chiranjeevi
పూరి జగన్నాధ్ 'స్లమ్ డాగ్' నుంచి టబు పాత్ర ఇంట్రడక్షన్ వీడియో వచ్చింది. టఫ్ పోలీస్ ఆఫీసర్ తరహా ప్రెజెంటేషన్‌లో కొత్తదనం కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పూరి జగన్నాధ్ 'స్లమ్ డాగ్' నుంచి టబు పాత్ర ఇంట్రడక్షన్ వీడియో వచ్చింది. టఫ్ పోలీస్ ఆఫీసర్ తరహా ప్రెజెంటేషన్‌లో కొత్తదనం కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Chiranjeevi
పూరి జగన్నాధ్ లేటెస్ట్ సినిమా స్లమ్ డాగ్. పూర్తయి చాలా కాలం అయింది. కానీ విడుదల ఎప్పుడు అన్నది తెలియదు. విజయ్ సేతుపతి హీరో. ఆ మధ్య తమిళనాడులో టీజర్ లాంచ్ చేసారు. కానీ అనుకున్నంత రేంజ్ కు అయితే రీచ్ కాలేదు. తరువాత తరువాత ఇంకా చాలా కంటెంట్ వస్తుంది కదా..కచ్చితంగా సమ్ థింగ్ వుంటుందనే పూరి అభిమానుల ఆశ.
ఇలాంటి నేపథ్యంలో టబు పాత్ర ఇంట్రడక్షన్ విడియో వచ్చింది. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ అంటూ. పోలీస్ డ్రెస్, లాఠీ హడావుడి..కానీ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్..సరే అదంతా వేరే సంగతి. పాత్ర ఏమన్నా కొత్తగా వుందా అంటే అదీ లేదు. టబు కు ఈ పాత్ర కొత్త కావచ్చు. నిజానికి టబు పోలీస్ పాత్ర గతంలో కూడా చేసారు. ఓ టఫ్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ, డమ్కీ ఇవ్వడం, ఆ సెటప్ అంతా ఇప్పటికి సవాలక్ష సార్లు చూసినట్లే వుంది తప్ప కొత్తగా ఏమీ లేదు.
సీన్ ప్రెజెంటేషన్, ఫ్రేమ్, డైలాగ్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఇలా ప్రతి దాంట్లో జనం కొత్తదనం చూస్తున్నారు ఇప్పుడు. అందులోనూ కాస్త గ్యాప్ తరువాత పూరి నుంచి కంటెంట్ వస్తోంది అంటే అందులో ఏదో ఒకటి వుండాలి. ఇది జస్ట్ పాత్ర పరిచయం అని అనుకోవాలి. సినిమాలో ఆ వైవిధ్యం కనిపిస్తుందేమో? అలాగే ట్రయిలర్ అనేది వుంది కదా. చూడాలి. పూరి తన అభిమానులను ఎలా సంతృప్తి పరుస్తారో?