Chiranjeevi
గత రెండు నెలలుగా టాలీవుడ్ థియేటర్లు కళకళలాడుతున్నాయి. పెద్దగా ప్రశంసలు అందుకోని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. ఓటీటీ మీద ఆసక్తి తగ్గడం కూడా దీనికి కారణమేనా?
గత రెండు నెలలుగా టాలీవుడ్ థియేటర్లు కళకళలాడుతున్నాయి. పెద్దగా ప్రశంసలు అందుకోని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. ఓటీటీ మీద ఆసక్తి తగ్గడం కూడా దీనికి కారణమేనా?
Chiranjeevi
గత రెండు నెలలలుగా థియేటర్లు కళకళ లాడుతున్నాయి. అలా అని మాంచి కంటెంట్ సినిమాలు వచ్చేసాయా అంటే లేదు. వచ్చిన సినిమాలు అన్నీ క్రిటిక్స్ నుంచి నూటికి నూరు శాతం సర్టిఫికెట్ లు ఇచ్చినవి కాదు. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నయ్ లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు ఇవన్నీ కూడా 2.25 నుంచి 2.75 రేటింగ్ అందుకున్నవే. కొంతమంది గట్టిగా విమర్శించినవే. కానీ థియేటర్లలో మాత్రం బాగానే ఆడాయి. ఆడుతున్నాయి. దీనికి రీజన్ ఏమిటి?
క్రిటిక్స్ రాంగ్ అని సినిమా ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ లు అనడం కామన్. కానీ గత రెండు మూడేళ్లుగా అలా జరగడం లేదు కదా. క్రిటిక్స్, సోషల్ మీడియా అంతగా బాలేదన్న సినిమా థియేటర్లలో రెండో రోజు కూడా బతికి బట్ట కట్టలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా..ఆ మాత్రం, ఈ మాత్రం అటు ఇటుగా వున్న జనం క్షమించేసి, థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారు.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఫస్ట్ వీకెండ్ ముగిసాక సోమవారం నాడు సాధారణంగా డ్రాప్ వుంటుంది. మండే ఏ మేరకు డ్రాప్ వుంది అన్న మేరకు సినిమా రన్ అంచనా వేయడం కామన్. కానీ ఇటీవల ఈ నాలుగు సినిమాలకు మండే కూడా కలెక్షన్లు బాగానే వుండడం.
తాము అందించనవి గొప్ప సినిమాలా కాదా? కేవలం కావాలని క్రిటిక్స్ బ్యాడ్ చేసారా? అన్న క్లారిటీ ఆయా సినిమాల నిర్మాతలకు, దర్శకులకు వుంది. పైకి తమ సినిమా సూపర్ అనడం కామన్. ఆ సంగతి అలా వుంచితే ప్రస్తుతం థియేటర్లు కళకళ లాడుతుంటే ఎగ్జిబిటర్లు ఫుల్ హ్యాపీగా వున్నారు. మళ్లీ థియేటర్లకు మంచి రోజులు వచ్చాయి అని సంబరపడుతున్నారు. ఈ సంబరం వెనుక ఓటిటి మీద కొంత ఆసక్తి తగ్గడం కూడా కారణం అనుకోవచ్చు.
ఎందుకంటే ఒకప్పుడు ఓటిటి ప్రారంభం అయినపుడు ఒక్క చందా కడితే ఇంటిల్లి పాదీ చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరు కడితే వారి ఫోన్ లో మాత్రమే వస్తుంది. టీవీ లో రావాలంటే వేరే డబ్బులు కట్టాలి. లాప్ టాప్ లో కావాలంటే వేరే కట్టాలి. అంతే కాక నెల వారీ చందాల పేరిట రేట్లు భారీగా పెంచేసారు.
అలా అని ఓటిటిలో సరిపడా కంటెంట్ వస్తోందా అంటే అదీ లేదు. అమెజాన్ ప్రయిమ్ లో తెలుగు కంటెంట్ తగ్గిపోతోంది. ఆహా లో చెప్పుకోదగ్గ కంటెంట్ రావడం లేదు. జీ 5 లో వస్తోంది కానీ దాని బ్రవుజింగ్ ఎక్స్ పీరియన్స్ అంత బాగుందనే టాక్ వుంది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లు మాత్రమే ఊరట. కానీ వాటిల్లో కూడా నెలకు ఒకసారి మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ కంటెంట్ వస్తోంది. మిగిలిన భాషలతో పాటు తెలుగు కంటెంట్ కూడా అన్న పరిస్థితి వుంది. అందువల్ల ఓటిటి రెన్యువల్స్ తగ్గుముఖం పడుతున్నాయని బోగట్టా. అందువల్ల మళ్లీ థియేటర్లకు కళ వస్తోందా అన్నది క్లారిటీ రావాల్సి వుంది.
ఇప్పటి వరకు నాలుగు సినిమాలు, నాలుగూ సెకండాఫ్ బాలేదు అని యునానిమస్ గా అన్న సినిమాలు థియేటర్లో బాగానే ఆడాయి. మరీ అద్భుతమైన కలెక్షన్లు రాబట్టలేదు కానీ అమ్మిన మేరకు, పంపిణీకి ఇచ్చిన మేరకు డబ్బులు రాబట్టాయి. ఇకపై కూడా మరో మూడు నాలుగు యావరేజ్ సినిమాలు ఇదే మాదిరిగా థియేటర్లలో ఆడితే టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్లే.