iDreamPost
android-app
ios-app

Anakapalli Movie: అనకాపల్లి..ఇంకా ఇంకా వెనక్కి

  • Published Aug 13, 2026 | 12:01 PM Updated Updated Aug 13, 2026 | 12:01 PM

లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటించిన ‘అనకాపల్లి’ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వరుసగా రిలీజ్ డేట్లు మారుతుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటించిన ‘అనకాపల్లి’ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వరుసగా రిలీజ్ డేట్లు మారుతుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Anakapalli Movie: అనకాపల్లి..ఇంకా ఇంకా వెనక్కి

నక్కిన త్రినాధరావు లాంటి కొన్ని హిట్ లు ఖాతాలో వున్న దర్శకుడు నిర్మాతగా చేసిన సినిమా అనకాపల్లి. నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరో. ఈసినిమా గత వారమే విడుదల కావాల్సింది. విడుదల ముందు రోజు ప్రీ రిలీజ్ మీట్ చేసి మరీ వాయిదా వేసారు. పోనీ అలా చేసి ఊరుకున్నారా అంటే అదీ లేదు. అనకాపల్లి టైటిల్ పెట్టినందుకు, నిర్మాతది ఆ ఊరు అయినందుకు, అక్కడ మాత్రం విడుదల చేసారు. అంటే సినిమా ఒకే ఒక ఊరిలో విడుదలయిందన్నమాట.

తరువాత వారం అంటే 14న విడుదల అన్నారు. కానీ మళ్లీ ఏమైందో సైలంట్ అయ్యారు. ఇప్పుడు ఎంక్వయిరీ చేస్తే వచ్చే నెలలో ఏదో డేట్ చూసి విడుదల చేసే ప్లాన్ లో వున్నారని తెలుస్తోంది. నిజానికి ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ. వాయిదా వేసినపుడు ఓ పద్దతిగా, ప్లాన్డ్ గా వాయిదా వేసి వుంటే సరిపోయేది.

చిన్న సినిమా ఎవరూ పట్టించుకోరు అనుకోవచ్చు. కానీ ఓ హీరో భవిష్యత్ కదా. లగడపాటి లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెలమెల్లగా స్వంత కాళ్ల మీద నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో సరైన సినిమా పడితే, అది బాగున్నా, బాగా లేకపోయినా, కుర్రాడు ఎలా చేసాడు అన్నది ఇండస్ట్రీలోకి వెళ్తుంది. అప్పుడు చాన్స్ లు రావడానికి అవకాశం వుంటుంది. మొత్తం మీద నక్కిన కు సరైన ప్లానింగ్ లేదని మరోసారి ప్రూవ్ అయింది.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetturkey girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom