iDreamPost

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్

  • Published Jun 29, 2024 | 6:21 PMUpdated Jun 29, 2024 | 6:21 PM

Pic Talk: ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది చిత్రపరిశ్రమలో అలరించిన స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. యూత్ మొత్తానికి ఈమె ఒక అందాల దేవత. వివిధ భాషాల్లో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇప్పటికైనా ఈమె ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది చిత్రపరిశ్రమలో అలరించిన స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. యూత్ మొత్తానికి ఈమె ఒక అందాల దేవత. వివిధ భాషాల్లో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇప్పటికైనా ఈమె ఎవరో కనిపెట్టారా..?

  • Published Jun 29, 2024 | 6:21 PMUpdated Jun 29, 2024 | 6:21 PM
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా..దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్

తెలుగు చిత్రపరిశ్రమలో వివిధ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ముద్దుగుమ్మలు తమ నటనతో, అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వారిలో తొలి సినిమాతోనే మంచి హిట్ ను అందుకొని, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారు చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా తమదైన ముద్రను వేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే ఇటు తెలుగుతో పాటు వివిధ భాషాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నా ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది చిత్రపరిశ్రమలో అలరించిన స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. యూత్ మొత్తానికి ఈమె ఒక అందాల దేవత. వివిధ భాషాల్లో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇప్పటికైనా ఈమె ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్నఈ చిన్నారి ఇండస్ట్రీలో ఆగ్ర కథనాయిగా ఓ వెలుగు వెలిగింది. అంతేకాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె జీవితంలో ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో.. ఆమె జీవితం మలుపు తిప్పింది.ఇప్పటికే ఆమె ఎవరో కనిపెట్టే ఉంటారు. ఆమె మరెవరో కాదు..మలయాళం కుట్టి ‘భావన మీనన్’. ఈమె పేరుకు మలయాళం బ్యూటీ అయిన తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మొదటిగా తెలుగులో మహత్మా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈమె నటన అందంతో తెలుగు అడియన్స్ ను ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఆ తర్వాత భావనకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో తిరిగి మలయాళంలో అవకాశాలు అందుకొని అక్కడే బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ క్రమంలోనే ఓ రోజు షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు ఆగంతకులు ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఒకప్పుడు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఆ హీరోయిన్ కిడ్నాప్ వ్యవహరం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన తర్వాతా చాలా సంవత్సరాలు సైలెంట్ అయ్యింది భావన. ఇక ఆ తర్వాత భావన 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే మలయాళంలో నడికార్ అనే సినిమాలో నటించింది. ఇటీవలే ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. భావన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే భావనకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసి నెటిజన్స్, ఫ్యాన్స్ గుర్తుపట్టాడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ, భావన చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భావన చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి