వరద బాధితులకు అండగా.. త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు! 50 లక్షల విరాళం..

Trivikram Srinivas, Producers Naga vamshi, Chinna Babu, donation: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా.. మేమున్నాం అంటూ టాలీవుడ్ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, రాధాకృష్ణ(చిన్నబాబు) రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.

Trivikram Srinivas, Producers Naga vamshi, Chinna Babu, donation: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా.. మేమున్నాం అంటూ టాలీవుడ్ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, రాధాకృష్ణ(చిన్నబాబు) రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.

గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతుండటంతో.. పట్టణాలు కాస్త చెరువులను తలపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. దాంతో ఎటు చూసినా పట్టణం జలమయమైంది. ప్రజలు నీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో ఆహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇక ఈ భారీ వరదల నేపథ్యంలో బాధితులకు టాలీవుడ్ అండగా నిలబడుతోంది. ఇప్పటికే చాలా ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్స్ నాగవంశీ, చిన్నబాబు(రాధాకృష్ణ) సంయుక్తంగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు ఎక్కడికక్కడ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారు రక్షించండి అంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటిస్తూ.. తమ మంచి మనసును చాటుకుంటున్నార. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రొడ్యూసర్స్ నాగవంశీ(సితార ఎంటర్ టైన్ మెంట్స్), చిన్నబాబు(రాధాకృష్ణ, హాసిని అండ్  హారిక క్రియేషన్స్) ముగ్గురు కలిసి వరద బాధితులకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఏపికి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షల చొప్పున ప్రకటించారు. ఈ చెక్ ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. యంగ్ టైగర్ NTR వరద బాధితులకు అండగా నిలుస్తూ.. ఇరు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున భూరి విరాళం ప్రకటించి తన ఉన్నతమైన మనసును చాటుకున్నాడు. తారక్ విరాళం ప్రకటించిన కొద్ది సేపటికే యంగ్ హీరో విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు(ఏపీకి 5, తెలంగాణకు 5 లక్షలు), వైజయంతి మూవీస్ రూ. 25 లక్షలను విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ కదిలిరావడం నిజంగా అభినందనీయం.

Show comments