iDreamPost
android-app
ios-app

ఆర్మీలో చేరడం మీ లక్ష్యమా?.. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. మిస్ చేసుకోకండి

  • Published Nov 26, 2024 | 10:38 AM Updated Updated Nov 26, 2024 | 10:38 AM

Agniveer Recruitment Rally 2024: ఆర్మీలో చేరతారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే. హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగబోతోంది. కుర్రాళ్లు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.

Agniveer Recruitment Rally 2024: ఆర్మీలో చేరతారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే. హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగబోతోంది. కుర్రాళ్లు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.

ఆర్మీలో చేరడం మీ లక్ష్యమా?.. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. మిస్ చేసుకోకండి

భారత త్రివిద దళాల నుంచి ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఖాళీల భర్తీకోసం అధికారులు చర్యలు చేపడుతుంటారు. ఆర్మీలో చేరాలనుకునే యువతకు ఇదొక సువర్ణావకాశం. చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న కుర్రోళ్లకి లైఫ్ సెట్ చేసుకునే ఛాన్స్ కల్పిస్తున్నాయి రక్షణ సంస్థలు. ఆర్మీలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న యువత ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. డిగ్రీ అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎవరికీ దక్కని అదృష్టం మీరు దక్కించుకోవచ్చు. ఎందుకంటే దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ రాదు కదా. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నారు ప్రజా కవి కాళోజీ.

ఆర్మీలో చేరడం ద్వారా దేశ సంపదకు, ప్రజలకు రక్షణ కల్పించొచ్చు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. ఆర్మీలో జాబ్ కొట్టాలనుకునే వారికి ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డ్ గుడ్ న్యూస్ అందించింది. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అగ్నివీర్‌ నియామక ర్యాలీ జరగనున్నది. ఆర్మీ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. డిసెంబరు 8 నుంచి 16వ తేదీ వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను నిర్వహించనున్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్‌, స్టోర్‌కీపర్‌, ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చు.

అభ్యర్థులు అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్‌, స్టోర్‌కీపర్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు ఎనిమిదో తరగతిలో పాసైతే సరిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (కరైకల్‌-యానాం) నుంచి మహిళా మిలిటరీ పోలీస్‌ అభ్యర్థులు ఈ ఏడాది జారీ చేసిన ఫిబ్రవరి 12 నాటి నోటిఫికేషన్‌ ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 040-27740059, 27740205 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. మరి మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని మిస్ చేసుకోకండి. ఆర్మీలో చేరాలనే మీ కలను నెరవేర్చుకోండి.