iDreamPost
android-app
ios-app

Telangana: వణికిస్తున్న చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!

  • Published Nov 26, 2024 | 10:53 AM Updated Updated Nov 26, 2024 | 10:53 AM

Telangana: తెలంగాణలో చలి ఒక రేంజిలో వణికిస్తుంది. పలు జిల్లాల్లో చలి పంజా విసురుతుంది.

Telangana: తెలంగాణలో చలి ఒక రేంజిలో వణికిస్తుంది. పలు జిల్లాల్లో చలి పంజా విసురుతుంది.

  • Published Nov 26, 2024 | 10:53 AMUpdated Nov 26, 2024 | 10:53 AM
Telangana: వణికిస్తున్న చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!

తెలంగాణలో చలి మామూలుగా లేదు. చలి పులిలా మారి పంజా విసురుతోందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జనాలు చలి తీవ్రతకు వణికి పోతున్నారు. 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే రాబోయే 3 రోజులు గజ గజ వణకడం పక్కా. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యంత తక్కువగా 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేగాక ఉమ్మడి ఆదిలాబాద్లో చాలా చోట్ల 10 డిగ్రీలు, HYD శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రం 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, జిల్లాల్లోని పలు మండలాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిసింది. ఈ జిల్లాల్లో మరో 2 రోజులు చలి చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కొన్ని మండలాల్లో చాలా తక్కువగా 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. అందుకే ఆ జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇలా చలి ఒక రేంజిలో వణికించడం వలన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి పిల్లల్లో శ్వాసకోస సంబంధిత సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఈ సమస్యలు 20 శాతం నుంచి 30 శాతం పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలపై, వృద్ధులపై ఎక్కువగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అంతేగాక హైపోథెర్మియాతో సమస్యలు వస్తాయని.. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి బయటకి రాకండి. జాగ్రత్తగా ఉండండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet