iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థినితో నగ్న పూజలు.. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 26, 2024 | 2:32 PM Updated Updated Nov 26, 2024 | 2:32 PM

మూఢనమ్మకాలు సమాజాన్నిపట్టి పీడిస్తున్నాయి. బాణామతి పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ హస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికతో నగ్న పూజలు చేయించేందుకు కుట్రపన్నింది ఓ వంట మనిషి.

మూఢనమ్మకాలు సమాజాన్నిపట్టి పీడిస్తున్నాయి. బాణామతి పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ హస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికతో నగ్న పూజలు చేయించేందుకు కుట్రపన్నింది ఓ వంట మనిషి.

  • Published Nov 26, 2024 | 2:32 PMUpdated Nov 26, 2024 | 2:32 PM
ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థినితో నగ్న పూజలు.. చివరకు ఏం జరిగిందంటే?

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషులను పోలిన మనుషులను సృష్టిస్తున్నారు. టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆరోగ్యం బాలేకపోయినా, వ్యాపారంలో కలిసి రాకపోయినా తమకు ఎవరో ఏదో చేస్తున్నారన్న భ్రమలో బ్రతుకుతున్నారు. అనుమానం పెంచుకుని దాడులకు తెగబడుతున్నారు. మంత్రాల నెపంతో దాడి చేసి ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు డబ్బు ఎక్కువ రావాలని, ప్రతి పనిలో సక్సెస్ కావాలని మూఢనమ్మకాలపై ఆధారపడుతున్నారు. బాబాలు, స్వామీజీల వద్దకు వెళ్లి పూజలు చేయించుకుంటున్నారు. ఇదే రీతిలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది.

డబ్బులకు ఏ కొదవా ఉండదని ఆశ చూపి విద్యార్థినితో నగ్న పూజలు చేయించేందుకు పూనుకుంది ఓ వంట మనిషి. నగ్నంగా పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించి ఘోరానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఓ విద్యార్థిని, తన సోదరితో కలిసి ఉంటుంది. కుటుంబం పేదరికంలో మగ్గుతుండడంతో ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్‌లో పనిచేసే ఓ వంట మనిషి వారిపై కపట ప్రేమను ఒలకబోసింది. ఆ ఇద్దరు బాలికలను చేరదీసినట్టుగా నటిస్తూ దారుణానికి తెరలేపింది.

మీ పేదరికం పోవాలంటే నగ్న పూజలు చేయాలని బాలికతో నమ్మించే ప్రయత్నం చేసింది. అలా చేస్తే కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తుందని ఆ బాలికను నమ్మించింది. ఆ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చని కష్టాలు తీరిపోతాయని చెప్పింది. అసలు నగ్న పూజలు అంటే ఏంటో తెలియని ఆ బాలిక వంట మనిషి మాయ మాటలు నమ్మింది. ఆమె చెప్పినట్లు చేయడానికి విద్యార్థిని ఒప్పుకుంది. దీంతో వారం క్రితం ఆ వంట మనిషి తన గదికి ఓ వ్యక్తిని తీసుకొచ్చింది. అక్కడకు బాలికను పిలిపించింది. ఆ తర్వాత అతని ముందు బాలికను నగ్నంగా నిలబడాలని చెప్పింది. అతడు పూజలు చేస్తాడని డబ్బుల వర్షం కురుస్తుందని నమ్మించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ బాలిక ఆందోళనకు గురైంది.

వెంటనే ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకుంది. అప్పుడు బంధువులు, తల్లిదండ్రులు బాలికను ఆరాతీయగా జరిగిన ఘోరాన్ని వివరించింది. అది విన్న వారు షాక్ కు గురయ్యారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హస్టల్ వద్దకు చేరుకుని వంటమనిషిని నిలదీశారు. ఆమె పొంతన లేని సమాధానలు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంట మనిషిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet