iDreamPost
android-app
ios-app

HanuMan: ‘హనుమాన్‌’ చూసి డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తండ్రి ఎమోషనల్‌! రివ్యూ కూడా ఇచ్చారు..

  • Published Jan 14, 2024 | 11:52 AM Updated Updated Jan 14, 2024 | 11:52 AM

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ‘హనుమాన్’ సినిమా జోరు మామూలుగా లేదు. బాక్సాఫీస్ దగ్గర హవా నడిపిస్తున్న ఈ మూవీని ప్రశాంత్ వర్మ తండ్రి చూశారు.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ‘హనుమాన్’ సినిమా జోరు మామూలుగా లేదు. బాక్సాఫీస్ దగ్గర హవా నడిపిస్తున్న ఈ మూవీని ప్రశాంత్ వర్మ తండ్రి చూశారు.

  • Published Jan 14, 2024 | 11:52 AMUpdated Jan 14, 2024 | 11:52 AM
HanuMan: ‘హనుమాన్‌’ చూసి డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తండ్రి ఎమోషనల్‌! రివ్యూ కూడా ఇచ్చారు..

‘హనుమాన్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. రిలీజ్​కు ముందు నుంచే టాక్ ఆఫ్ టౌన్​గా మారిపోయిందీ సినిమా. ప్రీమియర్ షోలతోనే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది ‘హనుమాన్’. అడ్వాన్స్ బుకింగ్స్​లోనూ సత్తా చాటిన ఈ ఫిల్మ్.. విడుదలైన తర్వాత ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో దుమ్మురేపుతోంది. ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ లాంటి బిగ్​ మూవీస్​ను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది ‘హనుమాన్’. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ తడాఖా చూపిస్తోంది. ఒక చిన్న చిత్రానికి ఇంత ఆదరణ లభిస్తుండటంతో ట్రేడ్ అనలిస్టులు కూడా షాకవుతున్నారు. అలాంటి ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి చూశారు. ‘హనుమాన్’ను చూశాక సాధారణ ప్రేక్షకుడిలా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. మూవీ ఎలా ఉందో రివ్యూ కూడా ఇచ్చారు.

‘హనుమాన్’ తీసినోడు తన కొడుకేనని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తండ్రి చెప్పారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. మూవీలోని ప్రతి క్యారెక్టర్ బాగుందన్నారు. నెక్స్ట్ ఏకంగా ‘హనుమాన్’ మీదే సినిమా వస్తుందంటూ ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేశారు. ఈ ఫిల్మ్ చూశాక ఇలాంటి ఫీలింగ్ మొదటిసారి కలిగిందంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమా తీసినోడు నా కొడుకే అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కొడుకు విజయాన్ని చూసి గర్వపడుతున్న తండ్రి సంతోషం ఆ కళ్లలో కనిపిస్తోందని అంటున్నారు. తన కొడుకు వర్క్​ను అందరూ ప్రశంసిస్తుంటే కలిగే ఆనందం ఇదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘హనుమాన్’ చూసిన నార్మల్ ఆడియెన్స్​ సంతోషంగా ఫీలవుతుంటే.. స్వయంగా డైరెక్టర్ తండ్రి ఇంకెంత గర్వపడాలో చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ప్రశాంత్ వర్మపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియన్ సినిమాకు మరో రాజమౌళి దొరికాడని అంటున్నారు. అయితే జక్కన్న, ప్రశాంత్ నీల్​ లాంటి వారికి మూవీ తీయాలంటే వందల కోట్లు కావాలని కానీ.. ప్రశాంత్ తక్కువ బడ్జెట్​లోనే విజువల్ వండర్ తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, వసూళ్ల విషయానికి వస్తే.. ఫస్ట డే ‘హనుమాన్’ మూవీ వరల్డ్ వైడ్​గా ఏకంగా రూ.21 కోట్లు వసూలు చేసింది. ఒక చిన్న చిత్రం ఇంత భారీ ఓపెనింగ్స్ రాబట్టడం అంటే మాటలు కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లో ఈ మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్​ను రాబట్టింది. మూడో తెలుగు రాష్ట్రంగా మారిన యూఎస్​లో తొలి రోజు ఏకంగా రూ.7 కోట్లు రాబట్టింది. ‘హనుమాన్’ ఊపు చూస్తుంటే మరో వారం రోజులు అన్ని చోట్లా హౌస్​ఫుల్స్ ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి.. ‘హనుమాన్’ సినిమాను మీరు చూశారా? ఒకవేళ చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: రూ. 30 కోట్ల ఖర్చుతో.. రూ. 500 కోట్ల సినిమాలా ఎలా తీశారు..? హనుమాన్ సీక్రెట్

 

View this post on Instagram

 

A post shared by Mr_bhattu_000 (@mr_bhattu_000)