iDreamPost
android-app
ios-app

సైబర్ పోలీసులను ఆశ్రయించిన ‘గుంటూరు కారం’ టీమ్‌.. కారణమిదే!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి బరిలో దూసుకెళ్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ విషయంపై గుంటూరు కారం టీమ్ పోలీసులను ఆశ్రయించింది.

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి బరిలో దూసుకెళ్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ విషయంపై గుంటూరు కారం టీమ్ పోలీసులను ఆశ్రయించింది.

సైబర్ పోలీసులను ఆశ్రయించిన ‘గుంటూరు కారం’ టీమ్‌.. కారణమిదే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  కాంబినేషన్ లో వచ్చిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతికి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్  టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, మీనాక్షి చౌదరి మహేశ్‌ మరదలి పాత్రలో అందరిని ఆకట్టుకుంది. సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం  మంచి వసూళ్లు సాధింస్తోంది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయంలో గుంటురు కారం టీమ్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. మరి.. కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సంక్రాంతి పండగ సందర్భంగా గుంటూరు కారం మూవీ  థియేటర్లలో సందడి చేస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు  సినీ ప్రియులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్, కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శ్రీలీల తన అందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మాణంలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. గుంటూరు కారంలో రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, రఘబాబు, ఈశ్వరి రావు, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. థమన్‌ అందించిన సంగీతం ఈ సినిమాను చార్ట్‌ బస్టర్‌ గా నిలిచాయి.

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉండడంతో మహేశ్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా గుంటూర కారం మూవీని చూసేందుకు థియేటర్లకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాపై  కొందరు నెగెటీవ్ టాక్ ప్రచారం చేయడం చిత్ర బృందాన్ని బాధించింది. ఈ  చిత్రంపై కొందరు నెగెటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారని టీమ్ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై  సైబర్ పోలీసనలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అంతేకాక పలు అంశాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

ప్రముఖ థియేటర్‌ బుకింగ్‌ యాప్‌ ‘బుక్‌ మై షో’లో మహేశ్‌ బాబు సినిమాకు 0/1 రేటింగ్ రావడం, అలాగే కేవలం 70 వేల ఓట్లే పడడంపై ఆరా తీయాలని సైబర్‌ పోలీసులను గుంటూరు కారం టీమ్ కోరినట్లు సమాచారం. ఫేక్‌ ఓటింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు ఆ ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. కాగా మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 127 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు టీమ్ వెల్లడించింది. మరి..గుంటూరు కారం సినిమా విషయంలో వినిపిస్తోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.