iDreamPost
android-app
ios-app

ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తు పట్టారా.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్‌గా చేస్తోంది

  • Published Sep 01, 2023 | 9:15 AM Updated Updated Sep 01, 2023 | 9:15 AM
  • Published Sep 01, 2023 | 9:15 AMUpdated Sep 01, 2023 | 9:15 AM
ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తు పట్టారా.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్‌గా చేస్తోంది

సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్‌గా వినిపించే డైలాగ్‌.. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను అని. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. యాక్టింగ్‌తో పాటు.. చదువులో కూడా రాణిస్తుంటారు. తాజాగా హీరోయిన్‌ శ్రీలీల, సాయి పల్లవి వంటి వారు.. ఎంబీబీఎస్‌ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటుల్లో కొద్ది మంది మాత్రమే ఉన్నత విద్యను పూర్తి చేసిన వారు ఉన్నారు. కెరీర్‌లో బిజీగా అవ్వడం వల్ల.. చదువును కొనసాగించలేకపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక కొందరు తారలు మాత్రం.. సినిమాల కన్నా కూడా చదువుకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్‌ కూడా ఇదే పని చేసింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి.. లాయర్‌ కోర్స్‌ పూర్తి చేయడమే కాక.. ప్రస్తుతం సుప్రీంకోర్టు లాయర్‌గా పదన్నోతి పొందింది. ఇంతకు ఆ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా..

హీరోయిన్‌ రేష్మా రాథోడ్‌ గుర్తుందా.. బాడీగార్డ్‌ సినిమాలో త్రిష ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత.. ఈ రోజుల్లో చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. మంచి సక్సెస్‌ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా విజయం సాధించినా.. ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఈ రోజుల్లో చిత్రం తర్వాత వరుసపెట్టి.. జై శ్రీరామ్‌, లవ్‌ సైకిల్‌, ప్రతిఘటన, జీలకర్రబెల్లం, అప్పవుమ్‌ వీంజమ్‌(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్‌ (తమిళ్‌) తదితర చిత్రాలు చేసింది. కానీ అవేవి ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు.

ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ పార్టీలో చేరింది. దాంతో పాటే లాయర్‌ కోర్స్‌ కూడా పూర్తి చేసింది. ఈ రెండు రంగాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది రేష్మా. ఈ మధ్యే జూలైలో సుప్రీంకోర్టు లాయర్‌గా పదోన్నతి పొందింది. సినిమాల్లో ఉన్నప్పుడు ఒకలా ఉన్న రేష్మా.. ప్రస్తుతం చాలా మారిపోయింది. లాయర్‌ కోటులో ఆమెను చూసిన వారు వెంటనే గుర్తు పట్టలేకపోయారు. అయితే తెలుగు హీరోయిన్‌ ఇలా సుప్రీకోర్టు లాయర్‌ కావదడం మాత్రం గ్రేట్‌ అని చెప్పొచ్చు. ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by ReshmaRathore (@reshmarathore)