Krishna Kowshik
పులి నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే.. పంజా దెబ్బ గట్టిగా తగలుతుందని అర్థం. ఇప్పుడు అదే రుజువైందని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. సంక్రాంతి మూవీ నుండి తప్పుకుని.. ఆలస్యంగా ఫిబ్రవరి 9న థియేటరల్లోకి వచ్చిన ఈగల్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే.
పులి నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే.. పంజా దెబ్బ గట్టిగా తగలుతుందని అర్థం. ఇప్పుడు అదే రుజువైందని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్. సంక్రాంతి మూవీ నుండి తప్పుకుని.. ఆలస్యంగా ఫిబ్రవరి 9న థియేటరల్లోకి వచ్చిన ఈగల్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే.
Krishna Kowshik
సంక్రాంతికి రావాల్సిన రవితేజ ఈగల్ మూవీ ఆ బరి నుండి తప్పుకుని ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చేసింది. ఎలాంటి పోటీ లేకుండా ఎంటర్ అయిన ఈ చిత్రం శుక్రవారం నుండి బాక్సాఫీసు వద్ద ఈ సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన వాళ్లంతా ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. రవితేజ మరోసారి తన మాస్ యాంగిల్ బయటపెట్టాడంటూ చర్చించుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ మూవీతో రవన్న రెచ్చిపోయాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. తన కసినంత ఈ సినిమాలో చూపించాడని అంటున్నారు.
రవితేజ సరసన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, మరో బ్యూటీ కావ్య థాపర్ నటించారు. నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ మూవీకి దేవ్ జాంద్ సంగీతం అందించాడు. ఇదే అతడికి తొలి సినిమా. అయితే అదిరిపోయే బీజీఎం, మ్యూజిక్ ఇచ్చాడని సినిమా చూసిన వాళ్లు పేర్కొంటున్నారు. ఈ మూవీ ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ వర్తబుల్ అని, ఊహించని ట్విస్టు, క్లైమాక్స్ సూపర్ అంటూ ట్విట్టర్‌లో రచ్చ చేస్తున్నారు. ఇక మాస్ మహారాజా ఫ్యాన్స్ అయితే.. ‘మా అన్న ఇచ్చి పడేశాడంతే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని, ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ పండగ చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో ఫైట్స్ అయితే వేరే లెవల్ అట. మాస్ హీరోకు తగ్గ యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయట ఈ మూవీలో. రవితేజను దృష్టిలో పెట్టుకుని.. మాస్ సీక్వెన్స్‌ను ఓ రేంజ్ లో చూపించాడట దర్శకుడు కార్తీక్. అలాగే గట్టిగా ప్లాన్ చేశాడు కూడా. ఈగల్ సినిమా పార్ట్ 2 కూడా ఉందని తెలిసింది. ఈ పార్ట్ యుద్ధకాండ అనే పేరు ఖరారు చేశారట. ఈగల్ ఈ లెవల్లోనే ఉంటే.. ఇక యుద్దకాండలో మరో యాంగిల్ కనిపించడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు రవితేజ ఫ్యాన్స్. ఏదేమైనా ఈ సినిమా రవితేజ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందన్నమాట.
Just done with watching #Eagle #EagleMovie from beginning titles to end credits each frame pure mass.. bgm n pubg episode and sacrifice fight. Enjoyed every bit n director used his all cinematic liberties. Minus: little drag in middle but it will manage by mass fights. 3.5/5
— Mohan_The_King 👑 (@Mohan_TheKing) February 9, 2024