iDreamPost
android-app
ios-app

Raj Tarun : చిక్కుల్లో రాజ్ త‌రుణ్! ఇది నిజంగా రాంగ్ టైమ్!

  • Published Jul 09, 2024 | 7:27 PM Updated Updated Jul 10, 2024 | 7:10 AM

ఇండస్ట్రీ లో బడా హీరోలతో తో చిన్న చిన్న హీరోలు కూడా ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరు రాజ్ తరుణ్. అయితే రాజ్ తరుణ్ రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరి రాజ్ తరుణ్ కెరీర్ కు ఈ వివాదం అడ్డుపడనుందా!

ఇండస్ట్రీ లో బడా హీరోలతో తో చిన్న చిన్న హీరోలు కూడా ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరు రాజ్ తరుణ్. అయితే రాజ్ తరుణ్ రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరి రాజ్ తరుణ్ కెరీర్ కు ఈ వివాదం అడ్డుపడనుందా!

  • Published Jul 09, 2024 | 7:27 PMUpdated Jul 10, 2024 | 7:10 AM
Raj Tarun : చిక్కుల్లో రాజ్ త‌రుణ్! ఇది నిజంగా రాంగ్ టైమ్!

హీరో అవ్వాలని కలలు కనే వారు చాలా మంది ఉంటారు. కానీ అన్ని సమస్యలను అధిగమించుకుని.. ఆ కలను నిజం చేసుకునే వారు మాత్రం చాలా కొద్దీ మంది మాత్రమే ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న బడా హీరోల సంగతి అలా ఉంచితే.. చిన్న చిన్న హీరోలంతా కూడా ఈ విధంగా స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వారే. తీసిన కొద్దీ సినిమాలలో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ సంపాదించుకున్నా సరే హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తునే.. కొత్త సినిమాలను తీస్తూ ఉంటారు. అటువంటి వారిలో ఒకరు రాజ్ తరుణ్.తీసిన కొద్దీ సినిమాలతోనే రాజ్ తరుణ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ లో గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యే టైమ్ కి.. తన ప్రేమ వివాదం అతని కెరీర్ కు అడ్డుగా నిలవనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉయ్యాలా జంపాల సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సమయంలో ఈ సినిమా మంచి హిట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈ రేంజ్ లో యూత్ ను ఆకట్టుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కుమారి 21ఎఫ్ మూవీ అని చెప్పి తీరాలి. ఇప్పటికి కూడా ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ వరుసగా వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు అందిపుచ్చుకున్నారు. వాటిలో కొన్ని యావరేజ్ టాక్ ను సంపాదించుకోగా.. కొన్ని ప్లాప్స్ కూడా ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్స్ ప్లాప్స్ సహజం. అయితే కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ పేరు వినిపించడం లేదు. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాలు లైన్ లో ఉన్నాయి అనుకునే టైమ్ కి మరో వివాదం. నిన్న మొన్నటి వరకు మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా.. హీరో రాజ్ తరుణ్ అతని ప్రియురాలు లావణ్య గురించే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే ఇద్దరిలో తప్పు ఎవరిదీ అనే సంగతి పక్కన పెట్టేస్తే.. ఈ ఎఫెక్ట్ మాత్రం రాజ్ తరుణ్ కెరీర్ మీద పడుతుందని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం జరిగే ఈ వివాదం నిజంగా రాజ్ తరుణ్ కు ఈ సమయంలో జరగాల్సింది కాదు.

కొంతకాలం చేతిలో ఎటువంటి ప్రాజెక్ట్స్ లేక సైలెంట్ అయిపోయిన రాజ్ తరుణ్.. ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో ఐదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇక మరొక రెండు సినిమాలు స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. వీటిలో కనీసం ఒక్కటైన హిట్ సాధిస్తే కనుక ఇక రాజ్ తరుణ్ కెరీర్ లో మళ్ళీ గ్యాప్ అనేదే రాదు. ప్రస్తుతం ‘తిర‌గ‌బ‌డ‌రా స్వామి’, ‘భ‌లే ఉన్నాడే’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రిలీజ్ తర్వాత ఈ సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది అనే సంగతి కంటే కూడా.. ఇప్పుడు జరుగుతున్న వివాదం ప్రభావం ఈ సినిమాలపై పడనుందా అనే ప్రశ్నలే అందరిని ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ను , సినిమాలను కలపకుండా చూస్తే మాత్రం.. రాబోయే సినిమాల వలన రాజ్ తరుణ్ కెరీర్ లో మళ్ళీ వెనక్కు చూడాల్సిన అవసరం ఉండదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.