Krishna Kowshik
టీవీల్లో ప్రకటనలు వస్తున్నాయంటే..చాలా మంది చూడరు. ఆ మొత్తం కంపెనీ తన సేల్ కోసం, లాభాల కోసం ఈ యాడ్ చేస్తుందన్న అవగాహనకు వచ్చేశారు. కానీ గతంలో అలా కాదూ.. ఏదైనా ధారావాహిక లేదా సినిమా వచ్చినప్పుడు యాడ్స్ వస్తే ఇంట్రస్టుగా చూసేవారు. అటువంటి వాటిలో ఫైవ్ స్టార్ యాడ్ కూడా.
టీవీల్లో ప్రకటనలు వస్తున్నాయంటే..చాలా మంది చూడరు. ఆ మొత్తం కంపెనీ తన సేల్ కోసం, లాభాల కోసం ఈ యాడ్ చేస్తుందన్న అవగాహనకు వచ్చేశారు. కానీ గతంలో అలా కాదూ.. ఏదైనా ధారావాహిక లేదా సినిమా వచ్చినప్పుడు యాడ్స్ వస్తే ఇంట్రస్టుగా చూసేవారు. అటువంటి వాటిలో ఫైవ్ స్టార్ యాడ్ కూడా.
Krishna Kowshik
ఇప్పుడు యూట్యూబ్‌లో ఏ వీడియో ఓపెన్ చేయగానే..యాడ్ లేదా యాడ్స్ దర్శనమిస్తుంటాయి. కొన్ని స్కిప్ చేసేందుకు అవకాశం ఉంటే.. మరికొన్ని తప్పదూ.. ఆ ప్రకటన పూర్తయ్యేంత వరకు చూడాల్సిందే. అయితే ప్రకటన చూసేవాళ్ల కన్నా స్కిప్ ఆప్షన్ ఉంటే నొక్కేవాళ్లే ఎక్కువే. మరీ టీవీలో యాడ్ వస్తే స్కిప్ ఆప్షన్ ఉండదు కనుక చూడాల్సిందే. అలా సీరియల్ సీరియల్ మధ్యలో.. సినిమా మిడిల్‍లో సుత్తి (మన పెద్దోళ్లు ఈ మాట అనుకుంటారులెండీ) వస్తూ ఉంటుంది. టీవీ కట్టడం ఎందుకులే అని భరించి ఆ ప్రకటనలు చూస్తూ ఉంటారు. అలా చూసి చూసి వాటిని కూడా నేర్చేసుకుంటారు పిల్లలు. కొన్ని సార్లు అనుకోకుండా పాటల రూపంలో పాడేస్తుంటారు.
తమ ప్రొడక్ట్ ప్రమోట్, సేల్ చేసుకోవడానికి సదరు సంస్థలు.. తమ ఉత్పత్తులను కస్టమర్లను ఎట్రాక్ట్ చేసే విధంగా యాడ్స్ రూపొందిస్తుంటాయి. వీటిని ప్రముఖ చానల్స్‌కు అందిస్తుంటాయి. ఇదంతా మార్కెటింగ్ స్కిల్. ప్రొడక్ట్ ఎలా ఉన్నా ఆ ప్రకటనకి కనెక్ట్ అయితే మాత్రం కచ్చితంగా కొంటారు వీక్షకుల్లో ఉన్న వినియోగదారులు. ఇప్పుడు అంటే యాడ్స్ అప్ డేటెడ్, అర్థం పర్థం లేకుండా వస్తున్నాయి కానీ.. ఒకప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా, కాంప్లెన్ గర్ల్, బూస్ట్, బూమర్, ఆశ చాక్లెట్, సంతూర్ సోప్, కోల్గేట్, రెక్సోనా, లిరిల్, గోల్డ్ స్పాట్, పెప్సీ వంటి యాడ్స్ టెలివిజన్ ఛానల్స్‌లో చూసి వాటిని విపరీతంగా కొన్నవాళ్లున్నారు. అలాగే ఆ ప్రకటనల్లో పాటలు, డైలాగులు కూడా ఎడిక్ట్ అయిపోయినవారున్నారు. ఈ యాడ్ కూడా అలాంటిదే. ఈ ప్రకటన చూసి.. చాలా మంది క్యాడ్బరీ ఫైవ్ స్టార్ తిన్నారంటే అతిశయోక్తి కాదు.
ఇద్దరు స్నేహితులు.. ఓ షాపు దగ్గరకు వచ్చి ఫైవ్ స్టార్ చాక్లెట్ తింటారు. చాక్లెట్ తిన్న ఒకరిలో మరో వ్యక్తిని చూసి రమేష్ అంటాడు.. మరొకరు సురేష్ అని పిలుస్తాడు. ఎన్ని రోజులయ్యిందిరా నిన్ను చూసి అని ఇద్దరు హత్తుకుంటారు. వీరిద్దరి కలయిక చూసి షాప్ ఓనర్ కూడా మురిసిపోతాడు. మళ్లీ చాక్లెట్ కొంత తిని మళ్లీ రమేష్.. సురేష్ అని పిలుచుకుంటారు. ఈసారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు యజమాని. ఈ యాడ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఇద్దరు కలుసుకున్నప్పుడు.. ఇలానే రమేష్-సురేష్ అని మీమ్ చేసుకునే వాళ్లు. రమేష్-సురేష్ చాలా యాడ్స్ చేశారు. 2009 నుండి ప్రారంభమైన వీరి పరంపర.. కొన్నాళ్ల పాటు సాగింది. మరీ ఆ రమేష్, సురేష్ గా కనిపించిన నటులు.. ఇప్పడు ఎలా ఉన్నారో తెలుసా..?
ఫైవ్ స్టార్ ప్రకటనలో రమేష్‌గా కనిపించారు రాణా ప్రతాప్ సెంగార్, సురేష్ గా మెప్పించారు గోల్డీ దుగ్గల్. ఈ చాక్లెట్ తిని వీరూ మైమరిచిపోయి.. వారు గత విషయాలను కూడా మరిచిపోతుంటారు. ఈ ఫన్నీ ప్రకటన అప్పట్లో చాలా ఫేమస్ కూడా అయ్యింది. ఈ యాడ్స్ చేసేటప్పుడు ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారట వీరిద్దరూ. ఈ యాడ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు ఈ ద్వయం. 2018 వరకు దాదాపు 35-40 టీవీ, 200 డిజిటల్ ప్రకటన, షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించారు. ఇటీవల గోల్డీ మాట్లాడుతూ.. దర్శకుడు పాండే, రచయిత సోజ్వాల్, అగ్ని హోత్రి లేకుండా రమేష్-సురేష్ క్యారెక్టర్లు లేవని, అవి లేకుంటే.. తాము లేవని పేర్కొన్నారు. వీరిలో గోల్డీ నటుడే కాదూ, రైటర్ కూడా. అలాగే సోలోగా ట్రావెలింగ్ చేయడమంటే ఇష్టం. మరీ మీకు గుర్తున్నయాడ్, అందులో నటించిన నటీనటులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే.. కామెంట్స్ లో తెలియజేయండి.