నెట్ ఫ్లిక్స్ తర్వాత మరో దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్.. ఇండియాలో పాస్ వర్డ్ షేరింగ్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హాట్ స్టార్ యూజర్లకు పాస్ వర్డ్ షేరింగ్ అనేది కష్టతరం కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. డిస్నీ హాట్‌స్టార్ తన ప్రీమియం వినియోగదారులలో పాస్ వర్డ్ షేరింగ్ పరిమితం చేయడానికి పూనుకుంది. ఇకముందు ప్రీమియం వినియోగదారులు కేవలం నాలుగు డివైస్ లకు మాత్రమే లాగిన్ అవకాశం కల్పిస్తూ కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోందట. పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో హాట్ స్టార్.. నెట్‌ఫ్లిక్స్ ని ఫాలో అవుతోంది.
గత మే నెలలో.. నెట్ ఫ్లిక్స్ దాదాపు వందకు పైగా దేశాలలో పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని అమలుచేసింది. ఎక్కువమందికి స్ట్రీమింగ్ అవకాశం కల్పించడానికి.. అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని యూజర్లకు తెలిపింది. ప్రస్తుతం ఇండియాలో డిస్నీ హాట్‌స్టార్ అకౌంట్ ని నలుగురు యూజర్ల వరకు లిమిట్ అమలు చేసినప్పటికి.. మొన్నటివరకు 10 డివైస్ ల వరకు లాగిన్ అనుమతి కల్పించింది. అయితే.. ఈ కొత్త విధానాన్ని ఈ ఏడాది చివరిలో అమలు చేయాలని భావిస్తోందట హాట్ స్టార్. ప్రీమియం అకౌంట్స్ కి ముందుగా నాలుగు వరకే పరిమితి విధించడం హాట్ స్టార్ మొదటి లక్ష్యంగా పెట్టుకుందట. మరి ఇలా కొత్త నిబంధన అమలులోకి వస్తే.. ఇప్పడున్న యూజర్స్ లేదా కొత్తగా వచ్చే యూజర్స్ తగ్గే అవకాశం ఉందని విశ్లేషక వర్గాలు చెబుతున్నాయి. మరి హాట్ స్టార్ కొత్త నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.