iDreamPost
android-app
ios-app

నాకు దొరుకుతాడో లేదో.. విజయ్ దొవరకొండపై శేఖర్ కమ్ముల కామెంట్స్

  • Published Sep 03, 2024 | 12:13 PM Updated Updated Sep 03, 2024 | 12:13 PM

Sekhar Kammula: టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరో విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Sekhar Kammula: టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరో విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Sep 03, 2024 | 12:13 PMUpdated Sep 03, 2024 | 12:13 PM
నాకు దొరుకుతాడో లేదో.. విజయ్ దొవరకొండపై శేఖర్ కమ్ముల  కామెంట్స్

డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తెలుగు చిత్ర పరిశ్రమలో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియోన్స్ మెచ్చిన సినిమాలు తెరకెక్కించిన దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే.. ఆయన ఏ సినిమా తెరకెక్కించిన ఆ కథ, అందులో పాత్రలు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తిండిపోయాలా తీర్చిదిద్దాడంలో ఈయనకు సాటి ఎవరు లేరనే చెప్పవచ్చు. అంతలా ఇప్పటి వరకు శేఖర్ కమ్ములా  ఎన్నో బ్యూటీఫుల్ లవ్ స్టోరిలను తెరకెక్కించారు.

మరి, ఆ లిస్టులో హ్యాపీ డేస్,  లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ కూడా ఒకటి. ఈ రెండు సినిమాలతో ఎంతోమంది నటి, నటులు ఇండస్ట్రీకి పరిచయమైయ్యి తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మరి కొందరు స్టార్ హీరోలుగా క్రేజ్ ను తెచ్చుకున్నారు. అలాంటి వారిలో విజయ్ దేవర కొండ, నవిన్ పొలిశెట్టి, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్  కూడా ఒకరు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరో విజయ్ దేవరకొండపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరో విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో యాంకర్ శేఖర్ కమ్ములకు విజయ్ దేవరకొండతో మూవీ ఉంటుదా? అని ప్రశ్నించారు. ఇక ఆ ప్రశ్నకు శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. ‘విజయ్ దేవరకొండనా?.. వాడు ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు. నాకు వాడు దొరుకుతడో లేడో చూడాలి. అయినా నేను వాళ్లకి ఏదో గాడ్ ఫాదర్‌ని, ఛాన్స్ ఇచ్చానని, అందుకే ఈ స్థాయికి వచ్చారని  ఎప్పుడు కూడా అనుకోలేదు. వాళ్లకి ఛాన్స్ రావాలని వాళ్లు అనుకుంటారు. ఇక ఆ పాత్రకి సరిపోయే వ్యక్తి రావాలని నేను కోరుకుంటాను. ఒక వేళ క్యారెక్టర్ సరిపోయే పర్సన్ వస్తే వాళ్ల కంటే నేనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను.  అయితే ప్రస్తుతం విజయ్ ఉన్న పొజిషన్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చేప్పుకొచ్చారు. ఇక శేఖర్ కమ్ముల హీరో విజయ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరీ, శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş