iDreamPost
android-app
ios-app

డాడీ మూవీలో బన్నీ మాత్రమే కాదు.. పవన్ ఉన్నాడని తెలుసా..?

  • Published Feb 21, 2024 | 3:59 PM Updated Updated Feb 21, 2024 | 3:59 PM

సినిమా షూటింగ్స్ సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అవి అప్పట్లో మానిటర్‌లో చూసుకున్నా..పెద్దగా కనిపించవు. అవి వెండితెరపై కనిపించేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయిన సగటు ప్రేక్షకుడు అలాంటివి పట్టించుకోడు. కానీ అతడో సెలబ్రిటీ అయితే కచ్చితంగా చర్చించుకుంటారు.

సినిమా షూటింగ్స్ సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అవి అప్పట్లో మానిటర్‌లో చూసుకున్నా..పెద్దగా కనిపించవు. అవి వెండితెరపై కనిపించేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయిన సగటు ప్రేక్షకుడు అలాంటివి పట్టించుకోడు. కానీ అతడో సెలబ్రిటీ అయితే కచ్చితంగా చర్చించుకుంటారు.

  • Published Feb 21, 2024 | 3:59 PMUpdated Feb 21, 2024 | 3:59 PM
డాడీ మూవీలో బన్నీ మాత్రమే కాదు.. పవన్ ఉన్నాడని తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో యాక్షన్ మూవీస్సే కాదూ.. కుటుంబ కథా చిత్రాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి డాడీ. ఇందులో ఆయన కంప్లీట్ ఫ్యామిలీ మెన్‌గా కనిపిస్తారు. చిరంజీవి, సిమ్రాన్, ఆషిమా భల్లా హీరో హీరోయిన్లు. 2001లో విడుదలైన ఈ మూవీ హిట్ అనిపించుకుంది. ఎస్ ఎ రాజ్ కుమార్ అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ హమ్ చేస్తుంటారు అభిమానులు. గీతా ఆర్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. 2001 అక్టోబర్ లో విడుదలైన ఈ మూవీ.. 97 సెంటర్లలో 50 రోజులు.. 15 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ సినిమాను హిందీ, తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు.

అయితే ఈ మూవీలో మెగాస్టార్ మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంగతి చాలా మందికి తెలిసిందే. ఇందులో చిరంజీవి శిష్యుడిగా కనిపిస్తాడు. అతడి ట్రూప్‌లో ఓ డ్యాన్సర్‌గా ఉంటాడు బన్నీ. ఇందులో బన్నీ, చిరంజీవికి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి అనుకుంటారు. కానీ ఈ సినిమాతోనే ఈ ఐకాన్ స్టార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి పరిచయం అల్లు అర్జున్ అని కూడా ఉంటుంది. ఇందులో అల్లు వారసుడు.. గోపీ కృష్ణ అనేపాత్ర చేశాడు. తన దైన డ్యాన్సులతో మెప్పించాడు కూడా. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఓ సన్నివేశంలో కనిపిస్తాడు.

ఇది పొరపాటున జరిగిందా.. షూటింగ్ చూసేందుకు వచ్చి ఇలా కెమెరాకు చిక్కాడో తెలియదు కానీ మొత్తానికి మూవీలో అయితే ఉన్నాడు. పవన్ అని గుర్తించడం కూడా అసాధ్యం.. అలా ఒక్క సీనులోనే మెరుస్తాడు. ఇంతకు ఏ సీన్ అంటే.. చిరంజీవి రెండో పాప ఓ కాజ్ కోసం ఫండ్ వసూలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఓ గ్యాంగ్ ఓ పబ్ దగ్గరకు వస్తుంది. అప్పుడు పాప డబ్బులు తీసుకుని ఏడ్పిస్తోంది విలన్ గ్యాంగ్. ఆ సన్నివేశంలో ఫైట్ ఉంటుంది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. గ్యాంగ్ పబ్ లోకి వస్తున్న సమయంలో ఓ అమ్మాయి.. అబ్బాయి.. భయపడి లేచి నిల్చుకుంటారు.

ఆ యువకుడే పవన్. అయితే అందులో పవన్ గుండుతో కనిపిస్తారు. వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని ఉంటారు. ఈసీన్ జస్ట్ సెకన్ మాత్రమే.. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతుంది. చాలా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు అతడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. అది పొరపాటున జరిగిందా..  టీం గుర్తించిందో లేదో.  మీరు పవన్ గమనించినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet