iDreamPost
android-app
ios-app

9 నెలలు కావొస్తోంది ఇంకా డబ్బు ముట్టలేదన్న డెవిల్ విలన్.. నిర్మాత క్లారిటీ ఇదే!

  • Published Dec 14, 2023 | 9:41 PM Updated Updated Dec 14, 2023 | 9:41 PM

డెవిల్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన నటుడు చిత్ర నిర్మాతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పాత్ర షూటింగ్ పూర్తై తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు పేమెంట్ చేయలేదని ఆరోపించారు.

డెవిల్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన నటుడు చిత్ర నిర్మాతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పాత్ర షూటింగ్ పూర్తై తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు పేమెంట్ చేయలేదని ఆరోపించారు.

  • Published Dec 14, 2023 | 9:41 PMUpdated Dec 14, 2023 | 9:41 PM
9 నెలలు కావొస్తోంది ఇంకా డబ్బు ముట్టలేదన్న డెవిల్ విలన్.. నిర్మాత క్లారిటీ ఇదే!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం డెవిల్. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ జోనర్లను ఎంచుకుంటూ ప్రయోగాత్మక పాత్రలతో అలరిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా బజ్ క్రియేట్ చేస్తోంది. డెవిల్ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా డెవిల్ చిత్రంలో విలన్ గా చేసిన మార్క్‌ బెనింగ్‌టన్‌ చిత్ర నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నా పాత్ర షూటింగ్ పూర్తై తొమ్మిది నెలలు కావొస్తున్నా డబ్బులివ్వడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఓ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందంటే.. చిన్న చిన్న సమస్యలు వచ్చిపడుతుంటాయి. వాటన్నింటిని చిత్ర యూనిట్ ఎదుర్కోని సినిమాను పూర్తి చేస్తుంది. కానీ ఇక్కడ డెవిల్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ అందులో విలన్ గా నటించిన మార్క్‌ బెనింగ్‌టన్‌ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ పై విమర్శలు చేశారు. డెవిల్ విలన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాకు రావాల్సిన డబ్బులు అందలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్‌ చెప్పించారు. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే అవుతుందని అగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడానికి కొంచమైనా సిగ్గుండాలంటూ ఘాటుగా స్పందించారు.

మర్క్ చేసిన ఆరోపణలపై డెవిల్ నిర్మాత మోహిత్‌ రాల్యాని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నీకు అందాల్సిన మొత్తాన్ని ఎప్పుడో ముట్టజెప్పాము. నీమేనేజర్ కావాలనే డబ్బులు ఇవ్వలేదని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మోహిత్ తెలిపారు. నీకు తెలుగు రాదు కాబట్టే నీ పాత్రకు వేరేవారితో డబ్బింగ్‌ చెప్పించాల్సి వచ్చింది. అసలు అగ్రిమెంట్‌లో నీ పాత్రకు నువ్వే డబ్బింగ్‌ చెప్పాలన్న రూల్ లేనే లేదని స్పష్టం చేశారు. ఇక డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జంటగా మాళవికా నాయర్‌, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటించారు. మరి షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత కూడా డబ్బుులు ఇవ్వలేదని నిర్మాతపై డెవిల్ విలన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcepbahis girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom