iDreamPost
android-app
ios-app

ఈ లెక్కన మహేష్ రాజమౌళి మూవీ ప్రీమియర్స్ టికెట్ ఇకెంతుంటుందో..?

  • Published Dec 02, 2024 | 3:30 PM Updated Updated Dec 02, 2024 | 3:30 PM

SSMB 29 సుమారు 2027లో వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ఇప్పుడు సడెన్ గా SSMB ప్రీమియర్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. రీసెంట్ గా పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ టికెట్ రేట్లు ఏకంగా 1200 వరకు వెళ్లాయి. ఇది మేకర్స్ కు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఈ రేట్స్ సామాన్యులకు పెద్ద షాక్ ఏ ఇచ్చాయి.

SSMB 29 సుమారు 2027లో వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ఇప్పుడు సడెన్ గా SSMB ప్రీమియర్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. రీసెంట్ గా పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ టికెట్ రేట్లు ఏకంగా 1200 వరకు వెళ్లాయి. ఇది మేకర్స్ కు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఈ రేట్స్ సామాన్యులకు పెద్ద షాక్ ఏ ఇచ్చాయి.

  • Published Dec 02, 2024 | 3:30 PMUpdated Dec 02, 2024 | 3:30 PM
ఈ లెక్కన మహేష్ రాజమౌళి మూవీ ప్రీమియర్స్  టికెట్ ఇకెంతుంటుందో..?

SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ బిజీగా ఉంది. అటు జక్కన్న , మహేష్ కూడా ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ ను అటెండ్ అవుతున్నారట. ఎంత లేదన్న మరో రెండు నెలల్లో ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తీయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అక్కడున్నది రాజమౌళి కాబట్టి అందులో నిజం లేకపోలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాకుండా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు జక్కన్న. అందుకు తగినట్టుగా హాలీవుడ్ యాక్టర్స్ ను రంగంలోకి దించుతున్నాడు. దాదాపు ఈ సినిమా అంతా కంప్లీట్ అయ్యేసరికి మూడేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి ప్రేక్షకులు కూడా సిద్దపడే ఉన్నారు.

అంటే SSMB 29 సుమారు 2027లో వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ఇప్పుడు సడెన్ గా SSMB ప్రీమియర్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. రీసెంట్ గా పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ టికెట్ రేట్లు ఏకంగా 1200 వరకు వెళ్లాయి. ఇది మేకర్స్ కు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఈ రేట్స్ సామాన్యులకు పెద్ద షాక్ ఏ ఇచ్చాయి. సోషల్ మీడియాలో దీని గురించి రెండు రోజుల నుంచి ఎదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈ టికెట్ రేట్ల మీద జోకులు కూడా వేసుకుంటున్నారు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం అసలు తగ్గేదెలే అంటూ ప్రీమియర్స్ షోలలో మూవీ చూసేందుకు టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రేట్స్ ను దృష్టిలో ఉంచుకుని.. ఎప్పుడో రాబోయే రాజమౌళి మహేష్ సినిమా ప్రీమియర్ రేట్స్ ను కంపేర్ చేస్తున్నారు. SSMB ప్రీమియర్ చూడాలంటే ఇప్పటినుంచే డబ్బులు దాచుకోవాలేమో.. లేదా లోన్ తీసుకోవడం బెటర్ , ఇదంతా కాదు బాబు సినిమా ప్రీమియర్ చూడాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే రాజమౌళి సినిమా కాబట్టి.. పెట్టిన ప్రతి రూపాయికి తగినట్టే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాబట్టి అప్పటికి టికెట్ ధరలు ఎంత ఉన్నా కానీ చూడడానికి ఫ్యాన్స్ ఎక్కడా వెనుకడుగు వేయరు. పైగా మూడేళ్ళ తర్వాత ప్రీమియర్ షోస్ చూడడానికి టికెట్ రేట్లు కచ్చితంగా 5000 వరకు అమ్మే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అక్కడ సినిమా కూడా 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు కాబట్టి కచ్చితంగా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం లేకపోలేదు. ఇక వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రీమియర్ లు , ఫస్ట్ డే ఫస్ట్ షోస్ చూడడానికి ప్రేక్షకులు ఏ మేరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రకంగా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే ఆడియన్స్ థియేటర్స్ కు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.