iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు.. ఈసారి మరో ట్విస్ట్ !

  • Published Jun 17, 2024 | 8:26 AMUpdated Jun 17, 2024 | 8:26 AM

కల్కి సినిమా విడుదలకు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే మిగిలివుంది. దీనితో ఫ్యాన్స్ లో రోజు రోజుకి సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కల్కి సినిమా విడుదలకు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే మిగిలివుంది. దీనితో ఫ్యాన్స్ లో రోజు రోజుకి సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Jun 17, 2024 | 8:26 AMUpdated Jun 17, 2024 | 8:26 AM
Kalki 2898 AD: కల్కి టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు.. ఈసారి మరో ట్విస్ట్ !

తాజాగా కల్కి సినిమా ట్రైలర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కల్కి సినిమా గురించే విపరీతమైన బజ్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేస్తామని.. అనౌన్స్ చేయగా ప్రేక్షకులంతా … ఈ సాంగ్ విజువల్స్ లో ప్రభాస్ కూడా కనిపిస్తాడేమో అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ సాంగ్ విడుదల కావాల్సి ఉంది. సాంగ్ వస్తుంది అనుకునే లోపే.. ఆడియన్స్ ను కాస్త నిరాశ పరిచారు మేకర్స్. సాంగ్ అయితే రిలీజ్ చేశారు కానీ.. అది కేవలం ఆడియో సాంగ్ మాత్రమే. మరి లిరికల్ వీడియో ఎప్పుడు రాబోతుంది. అనే విషయాలను చూసేద్దాం.

సాధారణంగా ఏదైనా సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారంటే.. అందరూ లిరికల్ సాంగ్ తో పాటు కొన్ని విజువల్స్ నైనా ఎక్స్పెట్ చేస్తూ ఉంటారు. కానీ కల్కి సినిమా విషయంలో అలా ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకు మాత్రం కాస్త నిరాశ మిగిలింది. ఈ సినిమా నుంచి సాంగ్ ను రివీల్ చేస్తామన్న మేకర్స్.. కేవలం ఆడియో సాంగ్ ను మాత్రమే రిలీజ్ చేసి.. లిరికల్ వీడియోను జూన్ 17 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పటికే సినిమా విషయంలో పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందని.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభాస్ అభిమానులు.. ఇప్పుడు సాంగ్స్ కూడా ఇలా పోస్ట్ పోన్ అవుతుంటే.. ఇంకాస్త నిరాశ పడుతున్నారు. మరి ఈరోజైన ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారా లేదా అనే విషయాలు చూడాలి.

ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఆడియో సాంగ్ విషయానికొస్తే .. నాకు చుట్టూ నేనే అంటూ ఈ సాంగ్ మొదలవుతుంది. ఈ సాంగ్ విన్న డార్లింగ్ అభిమానులు… సాంగ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కేవలం ఆడియో మాత్రమే ఉండడంతో… ప్రతి సారి ఎదో ఒక ట్విస్ట్ అంటూ కాస్త ఫైర్ అవుతున్నారు. అయితే ఈ పాట నిజంగా భైరవ కోసమే రాశారా అన్నంత బాగా ఆ క్యారెక్టర్ కు సింక్ అయింది. మరి లిరికల్ వీడియో కూడా ఇదే రేంజ్ లో ఉంటే.. ఇక ఈ సాంగ్ ఇంకాస్త ఫేమస్ అవ్వడం ఖాయం. ఇక ప్రస్తుతం కల్కి టీమ్ మూవీ ప్రమోషన్స్ దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి