iDreamPost
android-app
ios-app

‘భగవంత్ కేసరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • Author singhj Published - 04:57 PM, Sat - 22 July 23
  • Author singhj Published - 04:57 PM, Sat - 22 July 23
‘భగవంత్ కేసరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఇమేజ్ కలిగిన హీరోల్లో అగ్రస్థానంలో ఉంటారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీ నరసింహ’, ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సినిమాలు ఆయనకు మాస్ ఆడియెన్స్​లో కల్ట్ ఫాలోయింగ్​ను ఏర్పర్చాయి. బాలయ్య సినిమా వస్తోందంటే చాలు.. ప్రేక్షకులు వేసే ఈలలు, చేసే గోలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆయన మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ వసూళ్లతో షేక్ అవుతుంది. అలాంటి బాలయ్య నుంచి నెక్స్ట్ ఫిల్మ్ కోసం ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది ‘భగవంత్ కేసరి’ మూవీ టీమ్.

బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. కామెడీ మూవీస్​కు కేరాఫ్ అడ్రస్​ అయిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్​గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్​ కనిపించనుండటం విశేషం. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ‘భగవంత్ కేసరి’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్​కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

పోస్టర్స్, టీజర్స్​తో ఆడియెన్స్ నుంచి మంచి అటెన్షన్ తీసుకున్న ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్​పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దీనిపై ఎట్టకేలకు మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19, 2023న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ ఒక పోస్టర్​ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ అంటూ ఆ పోస్టర్​కు క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి.. బాలయ్య నుంచి వస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ రిలీజ్ కోసం మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom