iDreamPost
android-app
ios-app

ప్రముఖ నిర్మాతకు షాకిచ్చిన అధికారులు.. ఏకంగా షాపింగ్ మాల్ సీజ్!

  • Published Feb 14, 2024 | 6:28 PM Updated Updated Feb 14, 2024 | 6:28 PM

producer shopping mall seized: ప్రముఖ ప్రొడ్యూసర్ కు చెందిన షాపింగ్ మాల్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ నిర్మాత తెలుగులో పలు చిత్రాలను నిర్మించాడు.

producer shopping mall seized: ప్రముఖ ప్రొడ్యూసర్ కు చెందిన షాపింగ్ మాల్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ నిర్మాత తెలుగులో పలు చిత్రాలను నిర్మించాడు.

ప్రముఖ నిర్మాతకు షాకిచ్చిన అధికారులు.. ఏకంగా షాపింగ్ మాల్ సీజ్!

సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగా, లేటెస్ట్ కన్నడ సెన్సేషన్ కాటేరా మూవీలను నిర్మించిన నిర్మాతకు భారీ షాకిచ్చారు అధికారులు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ కు చెందిన ఓ షాపింగ్ మాల్ ను ఫిబ్రవరి 14న సీజ్ చేశారు. రూ. 11. 51 కోట్ల పన్ను చెల్లించలేదని, దీంతో నోటీసులు పంపించామని అయినా స్పందించకపోవడంతో.. తాజాగా సీజ్ చేశామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాక్ లైన్ వెంకటేష్.. నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడతో పాటుగా తెలుగులో అనేక చిత్రాలను రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. బజరంగీ భాయిజాన్, రజినీకాంత్ లింగా, కాటేరా, రవితేజ పవర్, ఆటగధరా శివ లాంటి చిత్రాలను తన బ్యానర్ పై నిర్మించాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా రాక్ లైన్ వెంకటేష్ కు చెందిన ఓ షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు బెంగళూరు మహానగర పాలికే(BBMP) అధికారులు సీజ్ చేశారు. బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్ ప్రీతీ గెహ్లాట్, జోనల్ జాయింట్ కమిషనర్ బాలశేఖర్ సమక్షంలో అధికారులు దాడులు నిర్వహించారు.

కాగా.. 2011 నుంచి 2022-23 వరకు మాల్ మేనేజ్ మెంట్ వారు మహానగర పాలికేకు చెల్లించాల్సిన పన్ను రూ. 11.51 కోట్లు ఇంత వరకు చెల్లించకపోవడంతో.. కార్పొరేషన్ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు స్పందించకపోవడంతో.. అధికారులు తాజాగా మాల్ ను సీజ్ చేశారు. మాల్ యాజమాన్యం పన్నులో సగం చెల్లిస్తేనే మాల్ ను ఓపెన్ చేస్తాం అని అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఈ కేసు కోర్టులో ఉంది.. అయితే కేసు పరిష్కారం అయినప్పటికీ.. పన్ను చెల్లించకపోవడంతో.. మాల్ కు తాళం వేశామని అధికారులు తెలిపారు. ఇక ఈ విషయంపై స్పందించాడు రాక్ లైన్ మాల్ మేనేజర్..”అధికారులు నిన్న రాత్రి మాకు నోటీసులు ఇచ్చారు. రాక్ లైన్ సార్ వచ్చే వరకు ఆగాలని మేం కోరాం. కానీ వారు ఆగలేదు. ఈ రోజు ఉదయం మాల్ కు తాళం వేశారు. కోర్టు ద్వారా బాకీ డబ్బులు కట్టాలని అధికారులు వెళ్లిపోయారు” అంటూ చెప్పుకొచ్చాడు మేనేజర్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Kalki Movie: కల్కి క్లైమాక్స్ లీక్! థియేటర్లలో మాస్ జాతరే!