iDreamPost

Kalki Movie: కల్కి క్లైమాక్స్ లీక్! థియేటర్లలో మాస్ జాతరే!

  • Published Feb 14, 2024 | 5:20 PMUpdated Feb 14, 2024 | 5:20 PM

ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ రాబోయే చిత్రం అయినా "కల్కి" మీదే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ తో భారీ హైప్ క్రియేట్ అవుతున్న సమయంలో.. తాజాగా కల్కి నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీనితో రోజు రోజుకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ రాబోయే చిత్రం అయినా "కల్కి" మీదే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ తో భారీ హైప్ క్రియేట్ అవుతున్న సమయంలో.. తాజాగా కల్కి నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీనితో రోజు రోజుకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

  • Published Feb 14, 2024 | 5:20 PMUpdated Feb 14, 2024 | 5:20 PM
Kalki Movie: కల్కి క్లైమాక్స్ లీక్! థియేటర్లలో మాస్ జాతరే!

గత ఏడాది ఆఖరిలో డార్లింగ్ ప్రభాస్ సినిమా “సలార్” చేసిన సందడి అంత ఇంత కాదు. థియేటర్ లో అందరికి పూనకాలు తెప్పించేశాయి ప్రభాస్ లుక్స్. గత కొంతకాలంగా సినిమాల విషయంలో కాస్త నిరాశ చూస్తున్న క్రమంలో.. సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ లో ఆ నిరాశలన్నీ కరిగిపోయి.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇక ఆ భారీగా క్రియేట్ అయిన హైప్ ను ఎక్కడ తగ్గనివ్వకుండా.. ఒక దాని తర్వాత ఒకటి డార్లింగ్ సినిమా అప్ డేట్స్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “కల్కి 2829 AD” . ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వరుసగా ఈ చిత్రం నుంచి తరచూ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీనితో ఈ చిత్రంపైన ఉన్న అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. అది కూడా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కు సంబంధించింది. ఆ అప్ డేట్ ఏంటో తెలుసుకుందాం.

‘కల్కి 2898 AD’ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం డార్లింగ్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. లాంటి భారీ తారాగణం కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు .. ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం.. సోషల్ మీడియాలో ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . అది కూడా ఈ మూవీ క్లైమాక్స్ సీన్ కు సంబంధించింది. అదేంటంటే చాలా మందికి అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఆలయం గురించి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఈ ఆలయంలో బయటపడిన ఆరు గదులలోని.. సిరి సంపదలతో.. అప్పటివరకు అత్యున్న సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమలను కూడా .. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడిన సంపద వెనుక్కు నెట్టేసిన సంగతి కూడా తెలిసిందే.

అయితే, ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడిన ఆరు గదులలో .. ఇప్పటివరకు ఐదు గదులను మాత్రమే తెరిచారు. ఈ ఐదు గదులలో బయట పడిన సంపద ఇప్పటివరకు .. సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటివరకు ఈ అనంతమైన సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షకులకుగా ఉంటున్నారు. అయితే, ఆ ఆలయంలో ఉన్న ఐదు గదులు తెరిచినప్పటికీ.. ఆరవ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో ఆ గదిని తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆ గదిలో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి అనేది.. ఎవరికీ ఎప్పటికి అంతు చిక్కని రహస్యం. ఇక ఇప్పుడు ‘కల్కి 2898 AD’ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ .. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని వీడని ఆరవ గది అంతు చిక్కని రహస్యానికి రిలేటెడ్ గా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొత్తం ఏడుగురు అమరులు కల్కి క్లైమాక్స్‌లో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా పైన రోజు రోజుకి .. అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని అంచనాలను పెంచుతుందో వేచి చూడాలి. మరి, ‘కల్కి 2898 AD’ చిత్రం లేటెస్ట్ న్యూస్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి