బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఇప్పటికే 6 సీజన్లను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే 7వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఇక బిగ్ బాస్ 7 లో పాల్గొనబోయేవారు వీరేనంటూ చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు.. యూట్యూబ్ సెన్సేషన్ బ్యాంకాక్ పిల్ల. యూట్యూబ్ లో ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తికాదు.
బిగ్ బాస్ 7.. త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి మీ ముందుకు రాబోతోంది. ఇక ఈ రియాలిటీ షో టైటిల్ లాంచ్ చేసినప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు మెుదలు కానుంది? ఏ టైమ్ కి టెలికాస్ట్ అవుతుంది? హౌస్ లోకి ఎంతమంది వెళ్తారు? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటిని నింపాయి. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన టైటిల్ లోగో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. దాంతో మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ 7 ప్రారంభం కానున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే ఈసారి హౌస్ లోకి వాళ్లు రాబోతున్నారు. వీళ్లు రాబోతున్నారు అంటూ చాలా పేర్లే వినిపించాయి.
ఈ లిస్ట్ లోకి మరోపేరు వచ్చి చేరింది. అవును బిగ్ బాస్ 7 లోకి యూట్యూబ్ సెన్సేషన్ బ్యాంకాక్ పిల్ల వచ్చేస్తుందట. తాజాగా ఆమె చేసిన ఓ వీడియోలో నేను త్వరలోనే ఇండియా వచ్చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. దాంతో తను వచ్చేది బిగ్ బాస్ 7లో పాల్గొనడానికే అని చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. విజయనగరానికి చెందిన బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి సమంత పూడి. బ్యాంకాక్ లో ఉండే ఈమె తన యూట్యూబ్ ఛానల్ ‘బ్యాంకాక్ పిల్ల’ పేరుతో బ్యాంకాక్ లోని పర్యాటక ప్రాంతాల్లో వీడియోలను తీసి తన ఛానల్ లో పోస్ట్ చేస్తుంటుంది.
కాగా.. ఈ బ్యాంకాక్ పిల్ల ఛానల్ కు రెండు మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. తన యాసతో, వీడియోలతో సెలబ్రిటీ హోదా తెచ్చుకుంది ఈ అమ్మడు. అయితే బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ 7 లోకి అడుగుపెడుతుంది అన్న వార్త మాత్రం రూమరనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తే.. కచ్చితంగా ఓ వీడియో ద్వారా అందరికి తెలియజేసేది. ఒకవేళ బ్యాంకాక్ పిల్ల నిజంగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందా? లేదా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి మీలో ఎంతమంది బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ 7లోకి రావాలి అనుకుంటున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Sravani Samanthapudi (@bangkok.pilla)
ఇదికూడా చదవండి: ఖుషీ మూవీ నుంచి లిరికల్ సాంగ్.. క్యూట్ కపుల్ గా విజయ్- సమంత!