iDreamPost

ఖుషీ మూవీ నుంచి లిరికల్ సాంగ్.. క్యూట్ కపుల్ గా విజయ్- సమంత!

ఖుషీ మూవీ నుంచి లిరికల్ సాంగ్.. క్యూట్ కపుల్ గా విజయ్- సమంత!

విజయ్ దేవరకొండ- సమంత జంటగా వస్తున్న ఖుషి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. టాలీవుడ్ లో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆ గ్యాప్ ని ఈ మూవీ ఫిల్ చేస్తుంది అంటూ.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఆరాధ్య.. నా ఆరాధ్య అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో మూవీలో విజయ్ దేవరకొండ- సమంత ప్రేమ, వారి బాడింగ్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని.. కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక కొత్తగా పెళ్లైన అబ్బాయి రోజూ పొద్దునే లేవడం చిన్న చిన్న పనులు చేసుకోవడం, తర్వాత ఆఫీస్ కు వెళ్లడం, రోజంతా భార్యను మిస్ అవుతూ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురుచూడటం.. వంటి విషయాలను ఈ వీడియో సాంగ్ లో చూడచ్చు. ముఖ్యంగా స్క్రీన్ మీద వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. చూడటానికి ఇద్దరూ ఎంతో క్యూట్ కపుల్ గా కనిపిస్తున్నారు.

సినిమాల పరంగా విజయ్ దేవరకొండ- సమంత ఇద్దరూ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వీళ్లిద్దరికి మంచి హిట్ మూవీ కావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమా పరాజయం తర్వాత విజయ్ మాత్రం ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాకుండా లుక్స్, క్యారెక్టరైజేషన్ మొత్తం గీతా గోవిందం స్టైల్ లో ఉండటంతో.. హిట్టు పక్కా అని రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

మరోవైపు సమంతకు యశోద, శాకుంతలంలాంటి సినిమాలు విఫలమయ్యాక ఖుషీ మూవీ తిరిగి ఆమెను ట్రాక్ లోకి తీసుకు వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ విషయంలో సమంత ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకుంది. ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ విదేశాల్లో ఘోర పరాభవం చవిచూసింది. ఆ వెబ్ సిరీస్ ని ఇండియన్ వర్షన్ లో కూడా నిర్మిస్తున్నారు. ఆ వర్షన్ లో సమంత- వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి