iDreamPost
android-app
ios-app

యానిమల్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

  • Published Mar 12, 2024 | 11:50 AM Updated Updated Mar 12, 2024 | 11:50 AM

Animal Television Date: డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన మూవీ యానిమల్. ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా ఎప్పుడూ టీవీల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Animal Television Date: డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన మూవీ యానిమల్. ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా ఎప్పుడూ టీవీల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

  • Published Mar 12, 2024 | 11:50 AMUpdated Mar 12, 2024 | 11:50 AM
యానిమల్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్లతో కలెక్షన్ల రికార్డులతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో కూడా సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మార్చి 17, 2024న సోనీ మ్యాక్స్‌లో రాత్రి 7:00 గంటలకు యానిమల్ (హిందీ వెర్షన్) ప్రసారానికి సిద్ధమవుతోంది. యానిమల్ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటించిన సంగతి తెలిసిందే. మాటలు రాని మూగ విలన్ గా ప్రేక్షకులని భయపెట్టి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయనకు మళ్ళీ స్టార్ ఇమేజ్ వచ్చి వరుస ఆఫర్లను సాధించారు. ఇక హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కూడా అద్భుతంగా నటించారు. ఇక రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. రణ్విజయ్ సింగ్ బర్బీల్ గా అత్యద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు.

నాన్న మీద అంతులేని ప్రేమతో పాటు ఆయన ప్రేమ దక్కలేదన్న అసహనం, శత్రువుల మీద కోపం ఇలా విభిన్న అంశాలున్న పాత్రని ఏమాత్రం తడబడకుండా చేసి తనదైన ముద్ర వేశారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ జాయింట్ వెంచర్‌గా నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అటు హిందితో పాటు ఇటు తెలుగులో కూడా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పాపా మేరీ జాన్ పాట అందరికీ ఫేవరెట్ రింగ్ టోన్ గా నిలిచింది. మరి బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసిన యానిమల్ టీవీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూద్దాం.