iDreamPost
android-app
ios-app

Janhvi Kapoor: టాలీవుడ్ ను దున్నేస్తున్న జాన్వీ! ముచ్చటగా మూడో సినిమా..

  • Published Jul 16, 2024 | 12:30 PM Updated Updated Jul 16, 2024 | 12:30 PM

ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే.. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ.. ఇండస్ట్రీని దున్నేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ముచ్చటగా మూడో మూవీని ఈ సుందరి దక్కించుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే.. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ.. ఇండస్ట్రీని దున్నేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ముచ్చటగా మూడో మూవీని ఈ సుందరి దక్కించుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 16, 2024 | 12:30 PMUpdated Jul 16, 2024 | 12:30 PM
Janhvi Kapoor: టాలీవుడ్ ను దున్నేస్తున్న జాన్వీ! ముచ్చటగా మూడో సినిమా..

ఒక్క సక్సెస్ వస్తే చాలు ఇండస్ట్రీలో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్స్ కే కాస్త అడ్వాంటేజీ ఎక్కువని చెప్పాలి. అయితే ఫస్ట్ మూవీనే ఫెయిల్ అయితే మాత్రం ఆ హీరోయిన్ ను పట్టించుకునే నాథుడే ఉండడు. ఇది జగమెరిగిన సత్యం. కానీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మాత్రం ఇందుకు భిన్నంగా టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే.. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ.. ఇండస్ట్రీని దున్నేస్తోంది. తాజాగా ముచ్చటగా మూడో మూవీని ఈ సుందరి దక్కించుకున్నట్లు టాక్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జాన్వీ కపూర్.. బాలీవుడ్ కు చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో జెండా పాతడమే కాకుండా.. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఇప్పటికే కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటుగా బుచ్చిబాబు-రామ్ చరణ్ RC 16లో కూడా జాన్వీనే హీరోయిన్. ఇలా ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే.. బిగ్ స్టార్స్ మూవీస్ లో ఛాన్స్ లు కొట్టేస్తూ.. టాలీవుడ్ హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను దక్కించుకున్నట్లు సమాచారం.

న్యాచురల్ స్టార్ నాని, దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో దసరా హిట్ కావడంతో.. శ్రీకాంత్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. వైవిధ్యమైన సబ్జెక్ట్ కావడం, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తుండటంతో.. ఇందులో జాన్వీ కపూర్ ను తీసుకుంటే.. బాలీవుడ్ లో అడ్వాంటేజీ దొరుకుతుందన్నది మేకర్స్ ఆలోచన. అందులో భాగంగానే నానికి జోడీగా జాన్వీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దీని తర్వాత నెక్ట్స్ ఇదే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే.. వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss