iDreamPost
android-app
ios-app

Allu Arjun: 10 కోట్ల ఆఫర్ కు నో చెప్పిన ఐకాన్ స్టార్! కారణం ఏంటంటే?

  • Published Dec 16, 2023 | 12:51 PM Updated Updated Dec 16, 2023 | 12:51 PM

రూ. 10 కోట్ల భారీ ఆఫర్ కు నో చెప్పారట టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి ఇంత పెద్ద మెుత్తం ఆఫర్ కు బన్నీ నో చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 10 కోట్ల భారీ ఆఫర్ కు నో చెప్పారట టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరి ఇంత పెద్ద మెుత్తం ఆఫర్ కు బన్నీ నో చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Dec 16, 2023 | 12:51 PMUpdated Dec 16, 2023 | 12:51 PM
Allu Arjun: 10 కోట్ల ఆఫర్ కు నో చెప్పిన ఐకాన్ స్టార్! కారణం ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కేశవ(జగదీష్) అరెస్ట్ కావడంతో.. సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది. కాగా.. ఈ చిత్రం తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే తాజాగా బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? ఓ చిన్న పని చేస్తే రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని ప్రముఖ కంపెనీ ఆఫర్ చేసిందట. కానీ ఆ ఆఫర్ కు నో చెప్పాడట ఐకాన్ స్టార్. ఇంతకీ ఆ చిన్న పని ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా సినిమా హీరోలు ఒక్క సినిమాలపైనే ఆధారపడరు. వారికీ కొన్ని బిజినెస్ లు ఉంటాయి. ఇవే కాక.. కొన్ని బ్రాండ్ వస్తువులకు ప్రమోషన్ ఇస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. చాలా మంది హీరోలు ఏదో ఒక బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ.. కోట్ల రెమ్యూనరేషన్ తీసుంటున్న విషయం మనందరికి తెలిసిందే. ఇక అందరికిలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొన్ని ఉత్పత్తులకు ప్రమోషన్ ఇస్తూ.. బాగానే సంపాదిస్తున్నాడు. అయితే డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ వస్తువులకు పడితే ఆ వస్తువులకు ప్రమోషన్లు ఇవ్వనని బన్నీ మరోమారు రుజువుచేశాడు. అసలు విషయం ఏంటంటే? బన్నీకి తాజాగా రూ. 10 కోట్ల ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్ ను బన్నీ తిరస్కరించాడట.

కాగా.. పుష్ప 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్ కు ఈ సినిమాలో మద్యం తాగే సన్నివేశాలతో పాటుగా, గుట్కా తినే సన్నివేశాల్లో తమ బ్రాండ్ల లోగోని ప్రమోట్ చేయాలని ఓ కంపెనీ ప్రపోజల్ తీసుకొచ్చిందట. అందుకోసం రూ. 10 కోట్ల భారీ మెుత్తంలో పారితోషికం కూడా ఇస్తామని చెప్పిందట సదరు కంపెనీ. అయితే ఈ ఆఫర్ కు బన్నీ నో చెప్పారట. ఎందుకంటే? ప్రజలకు హానికరం చేసే వస్తువులను తాను ప్రమోట్ చేయనని ఆ కంపెనీకి ఖరాఖండిగా చెప్పేశాడట బన్నీ. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది. ఇక తమ హీరో తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో కొందరు హీరోలు పాన్ మసాలా యాడ్స్ లో నటించి.. కోర్టు నోటీసులు కూడా అందుకున్నారు. ఇలాంటి యాడ్స్ వల్ల షారుఖ్, అక్షయ్ లాంటి హీరోలు కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. మరి యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetartemisbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş