iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ బాధితురాలికి అండగా అల్లు అర్జున్! కీలక హామీ!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడంటూ బయటకు వచ్చిన బాధితురాలికి తెలుగు సినీ ఇండస్ట్రీ నిలుస్తుంది. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, పూనమ్ కౌర్ నటీమణులు బాధితురాలికి మద్దతు తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఆ జాబితాలోకి వచ్చారని తెలుస్తుంది.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడంటూ బయటకు వచ్చిన బాధితురాలికి తెలుగు సినీ ఇండస్ట్రీ నిలుస్తుంది. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, పూనమ్ కౌర్ నటీమణులు బాధితురాలికి మద్దతు తెలిపారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఆ జాబితాలోకి వచ్చారని తెలుస్తుంది.

జానీ మాస్టర్ బాధితురాలికి అండగా అల్లు అర్జున్! కీలక హామీ!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను పలు మార్లు లైంగికంగా వేధించాడంటూ ఆయన దగ్గర వర్క్ చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబయి, చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తన ఇంట్లో కూడా పలుమార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంది. తను ప్రతిఘటించిన ప్రతిసారి దాడి చేశాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పోలీసుకు కంప్లయింట్ చేసింది. ఆఫర్లు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని తెలిపింది. దీంతో జానీ మాస్టర్ పై రేప్‌తో సహా పలు కేసులు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఇదిలా ఉంటే.. బాధితురాలికి మద్దతుగా నిలుస్తోంది టాలీవుడ్ ఇండస్ట్రీ.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచారు. తన సినిమాల్లో ఆమెకు అవకాశం ఇచ్చి.. మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు స్టైలిష్ స్టార్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తను చేయబోయే అన్ని సినిమాలకు వర్క్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారట బన్నీ. ఆయన నటించబోయే సినిమాల్లో కొరియోగ్రాఫ్ చేసే ఆఫర్ ఇచ్చి బాధితురాలికి బాసటగా నిలిచారు. దీంతో ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు. మానసికంగా భరోసానిచ్చినట్లయ్యింది. ఇప్పటికే ఆమె పుష్ప 2లో పనిచేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అదిరా మా అల్లు అర్జున్ అంటే.. కష్టకాలంలో బాధితురాలికి అండగా నిలిచారు అంటున్నారు. బన్నీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కాగా, సింగర్ చిన్మయి, నటి పూనమ్ కౌర్ కూడా బాధితురాలికి మద్దతు ప్రకటించారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతడ్ని డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని తెలిపింది. కాగా, ఈ కేసులో తాజాగా బాధితురాలు.. జానీ మాస్టర్ మాత్రమే కాదు.. అతడి భార్య కూడా మా ఇంటికి వచ్చి దాడి చేసిందని షాకింగ్ విషయాన్ని పోలీసులకు తెలిపింది. 3 గంటల పాటు లేడీ కొరియోగ్రాఫర్ నుంచి స్టేట్ మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఔట్ డోర్ షూటింగ్స్ సమయాల్లోనే కాదు క్యారవాన్‌లో కూడా పలుమార్లు తనను బలవంతం చేశాడని,  కాదంటే కొట్టేవాడని, అతడి టార్చర్ భరించలేక బయటకి వెళ్లి పనిచేసుకుంటుంటే.. అవకాశాలు లేకుండా చేశాడని, బెదిరించాడని తెలిపింది. వాంగ్మూలం అనంతరం ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు.