iDreamPost
android-app
ios-app

‘పుష్ప 2’ కోసం బన్నీ స్పెషల్ ప్లానింగ్.. ఊహకు అందని రీతిలో కొట్టేలా ఉన్నాడు!

  • Published Aug 29, 2024 | 9:33 PM Updated Updated Aug 29, 2024 | 9:33 PM

Allu Arjun, Pushpa 2 Movie, Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్ అంతా ఈగర్​గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘పుష్ప 2’. ఈ ఏడాది ఆఖర్లో రానున్న ఈ సినిమా మీద భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి.

Allu Arjun, Pushpa 2 Movie, Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్ అంతా ఈగర్​గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘పుష్ప 2’. ఈ ఏడాది ఆఖర్లో రానున్న ఈ సినిమా మీద భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి.

  • Published Aug 29, 2024 | 9:33 PMUpdated Aug 29, 2024 | 9:33 PM
‘పుష్ప 2’ కోసం బన్నీ స్పెషల్ ప్లానింగ్.. ఊహకు అందని రీతిలో కొట్టేలా ఉన్నాడు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్ అంతా ఈగర్​గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘పుష్ప 2’. ఈ ఏడాది ఆఖర్లో రానున్న ఈ చిత్రం మీద భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. ‘పుష్ప’ లాంటి బ్లాక్​బస్టర్ ఫిల్మ్​కు సీక్వెల్ కావడం, అల్లు అర్జున్-సుకుమార్ సక్సెస్​ఫుల్ కాంబోలో తెరకెక్కుతుండటంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ లాంటి ప్రమోషనల్ మెటీరియల్ కూడా విజయవంతం అవడం ఎక్స్​పెక్టేషన్స్​ను అమాంతం పెంచేసింది. టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ ఈ మూవీ కోసం ఓ రేంజ్​లో వెయిటింగ్ నడుస్తోంది. అందుకే డైరెక్టర్ సుకుమార్, బన్నీలు అన్ని విషయాల్లోనూ ఫుల్ కేర్ తీసుకుంటూ.. హై క్వాలిటీ ఎంటర్​టైన్​మెంట్​ను ఆడియెన్స్​కు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘పుష్ప 2’ కోసం ఓ విషయంలో వాళ్లు మరింత స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలిసింది.

‘పుష్ప’ పార్ట్-1 విషయంలో అన్నింటినీ సూపర్బ్​గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే చేశాడు. రిలీజ్​కు ముందు ఎక్కువ సమయం లేకపోయినా సినిమాను అందరికీ చేరువ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. మౌత్ పబ్లిసిటీ, సూపర్ హిట్ టాక్​ రావడంతో ఇటు తెలుగులో, అటు నార్త్​లో ‘పుష్ప’ వసూళ్లలో దుమ్మురేపింది. కలెక్షన్స్ ఊచకోత కోసి సూపర్ హిట్​గా నిలిచింది. అయితే ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు తగ్గొద్దని బన్నీ చెప్పాడట. ఆల్రెడీ ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబర్​ 6వ తేదీకి ఫిల్మ్​ పోస్ట్​పోన్ అయింది. విడుదలకు చాలా టైమ్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఫైనల్ కాపీని సిద్ధం చేసి.. పాన్ ఇండియా లెవల్​లో గ్రాండ్​గా ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నారట.

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోనూ ‘పుష్ప 2’పై భారీగా బజ్ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీగా ప్రమోషన్స్​ను ప్లాన్ చేస్తున్నారట బన్నీ-సుక్కూ. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారట. అదే సమయంలో యూఎస్​తో పాటు పలు ఇతర ఫారెన్ కంట్రీస్​లోనూ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఒకవేళ ఈ లెవల్​లో ప్రమోషన్స్​ జరిపి, అవి గనుక సక్సెస్ అయితే బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఇప్పటికే ‘పుష్ప 2’ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ట్రైలర్​తో అవి నెక్స్ట్‌ లెవల్​కు వెళ్లడం పక్కా. ఇంక ప్రమోషన్స్ కూడా భారీగా చేసి మూవీని అందరికీ మరింత రీచ్ చేస్తే.. ఊహించిన దాని కంటే మరింత భారీగా ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అని ట్రేడ్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మొత్తానికి బన్నీ-సుక్కూ ప్లానింగ్​తో బాక్సాఫీస్ పగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు. మరి.. ‘పుష్ప 2’ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.