iDreamPost
android-app
ios-app

బీచ్ లో బీరు తాగుతూ.. చిల్ అవుతున్న అల్లు అర్జున్ హీరోయిన్! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 12:46 PM, Fri - 7 July 23
  • Author Soma Sekhar Published - 12:46 PM, Fri - 7 July 23
బీచ్ లో బీరు తాగుతూ.. చిల్ అవుతున్న అల్లు అర్జున్ హీరోయిన్! వీడియో వైరల్..

సాధారణంగా సెలబ్రిటీలు షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే కాస్త టైమ్ దొరికితే చాలు.. వెకేషన్లకు వెళ్తు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ వారు చేసిన రచ్చను, ఎంజాయ్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా వియత్నాం వెకేషన్ కు వెళ్లిన అల్లు అర్జున్ హీరోయిన్ అక్కడి బీచ్ లో తెగ ఎంజాయ్ చేసింది. బీచ్ లో బీర్ తాగుతూ చిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బీచ్ లో బీర్ తాగిన బన్నీ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సెలబ్రిటీలకు కూడా కొన్ని పర్సనల్ అలవాట్లు ఉంటాయి. డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే అభిమానులకు తెలియకుండా ఈ పనికానిచ్చేవారు కొందరైతే.. ధైర్యంగా కొందరు తమకు ఉన్న అలవాట్లను బయటపెట్టేవారు మరికొందరు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్ బీచ్ లో బీర్ తాగుతూ.. చిల్ అవుతోంది. వెకేషన్ ను తెగ ఎంజాయ్ చేస్తూ.. కాక్ టైల్, బీర్లు డ్రింక్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఎవరో కాదు.. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా హీరోయిన్ భానుశ్రీ మెహ్రా.

వరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే, అలా ఎలా, మిస్టర్ ఇండియా, బ్రదర్ ఆఫ్ బోమ్మాళి లాంటి సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు. దాంతో తమిళ, కన్నడ ఇండస్ట్రీల వైపు తన దారి మళ్లించింది. అయినప్పటికీ చెప్పుకోదగ్గ పేరు ఈ భామకు రాలేదనే చెప్పుకోవాలి. ఇక అప్పుడప్పు వివాదాల్లో చిక్కుకుని హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది భాను శ్రీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటూ.. ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వియాత్నం వెకేషన్ కు వెళ్లిన ఈ అమ్మడు అక్కడి ప్రముఖ బీచ్ లు, రెస్టారెంట్స్ ల్లో ఎంజాయ్ చేస్తోంది. బీర్లు, కాక్ టెయిల్స్ తాగుతూ.. రచ్చ రచ్చ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by внanυѕнree мeнra (@mehrabhanushree)