P Venkatesh
సాటి వారికి సాయపడడంలోనే ఆనందముందని భావించి తన సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బును ఆ చిన్నారులకు అందజేశాడు. లక్షల్లో సాయం అందించిన ఆ హీరో గొప్ప మనసు చాటుకున్నారు.
సాటి వారికి సాయపడడంలోనే ఆనందముందని భావించి తన సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బును ఆ చిన్నారులకు అందజేశాడు. లక్షల్లో సాయం అందించిన ఆ హీరో గొప్ప మనసు చాటుకున్నారు.
P Venkatesh
ఆపద సమయాల్లో అయిన వారు కూడా పట్టించుకోని ఇప్పటి రోజుల్లో ఓ రీల్ హీరో రియల్ హీరో అయ్యాడు. ఆ చిన్నారుల కష్టాన్ని చూసి అక్కున చేర్చుకున్నాడు. సాటి వారికి సాయపడడంలోనే ఆనందముందని భావించి తన సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బును ఆ చిన్నారులకు అందజేశాడు. లక్షల రూపాయలను సాయం చేసి ఆ చిన్నారులకు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబానికి జీవనాధారమైన ఆవులు కలుషిత ఆహారం తినడం వల్ల మరణించడంతో ఆ చిన్నారులు మానసిక వేధనతో కుంగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ నటుడు వారికి ఆర్థిక సాయం అందించాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15) ఉన్నారు. వీరికి సుమారు 15 ఆవులు ఉన్నాయి. వీరి తండ్రి మరణానంతరం ఈ ఆవుల ద్వారానే కుటుంబాన్ని పోషించుకుంటూ పాడీ పరిశ్రమలో ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఆవులను పెంచుకుంటున్నారు. అప్పటి వరకు సజావుగానే సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా తలకిందులైంది. వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవులు మృతి చెందాయి. కలుషితమైన ఆహారం తినడం వల్లే ఆవులు మృతి చెందాయని సమాచారం. ఈ ఘటనతో మాథ్యూ, జార్జ్‌తో పాటు వారి తల్లి ఒక్కసారిగా మానసికంగా కుంగిపోయారు. దీంతో వారు ఆస్పత్రిపాలయ్యారు.
ఇక ఆవులు చనిపోవడంతో రోడ్డున పడ్డ ఆ కుటుంబం ధీన స్థితిని తెలుసుకున్న ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించి గొప్ప మనసు చాటుకున్నారు. కాగా ఈయన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ కు తండ్రి పాత్రలో నటించారు. ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ వెల్లడించారు.
వీరితో పాటు పలువులు మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆర్థిక సాయంతో పాటు ఐదు ఆవులను కూడా అందించనున్నట్లు అక్కడి మంత్రులు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరి నటుడు జయరామ్ చిన్నారులకు ఆర్థిక సాయం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.