iDreamPost
android-app
ios-app

Adipurush: రిలీజ్ కు ముందురోజే ‘ఆదిపురుష్’ మూవీకి షాక్.. షోలు రద్దు!

  • Author Soma Sekhar Published - 11:20 AM, Thu - 15 June 23
  • Author Soma Sekhar Published - 11:20 AM, Thu - 15 June 23
Adipurush: రిలీజ్ కు ముందురోజే ‘ఆదిపురుష్’ మూవీకి షాక్.. షోలు రద్దు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. సీతగా కృతి సనన్ నటిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలు పెంచుకునేందుకు ఇటు తెలంగాణ అటు ఏపీ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కు ముందురోజే ఆదిపురుష్ సినిమాకు భారీ షాక్ తగిలింది. మరి ప్రభాస్ మూవీకి తగిలిన ఆ షాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిపురుష్.. టాలీవుడ్ తో పాటుగా యావత్ భారతదేశ సినీ పరిశ్రమ మెుత్తం ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ. డార్లింగ్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదీకాక సుమారు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రామాయాణం ఆధారంగా, విజువల్ వండర్ గా తెరకెక్కిన ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఆదిపురుష్ టీమ్ కు అనుకోని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ల రేటు రూ. 50 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో టికెట్ల రేటు పెంపు గురించి మాత్రమే ఉందని, బెనిఫిట్ షోలు, తెల్లవారు ప్రదర్శనలపై ఈ జీవోలో ఎలాంటి ప్రస్తావన లేదు. దాంతో ఏపీలో ఆదిపురుష్ బెనిఫిట్ షోలు లేనట్లే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు లేకుంటే కలెక్షన్లలో భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇది సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపుతుందని సినీ పండితులు పేర్కొంటున్నారు.

ఇక గతంలోనూ పుష్ప, భీమ్లానాయక్ సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలకు బెనిఫిట్ షోల ప్రదర్శనను నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. ఇక అప్పట్లోనే జీవో నెం. 35 ను కూడా తీసుకోచ్చింది. అయితే హైకోర్టు ఈ జీవోను రద్దు చేసింది. ఇక బెనిఫిట్ షోల గురించి ఏపీ ప్రభుత్వం వద్ద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంస్థల ప్రతినిధులు ప్రస్తావించారట. కానీ వారి వాదనలను ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే విడుదలకు సమయం ఉండటంతో.. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా బెనిఫిట్ షోలు లేకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశే అని చెప్పాలి.