Dharani
పెళ్లై కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా జీవించాల్సిన ఆమె.. అత్యంత దారుణ నిర్ణయం తీసుకుంది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
పెళ్లై కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా జీవించాల్సిన ఆమె.. అత్యంత దారుణ నిర్ణయం తీసుకుంది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
Dharani
తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. తమకున్నంతలో ఎలాంటి కష్టం కలగకుండా బిడ్డను చూసుకున్నారు. చదివించారు.. సంస్కారం నేర్పారు. ఇక పెళ్లీడు వచ్చాక.. మంచి సంబంధం అని భావించి.. ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. తమకున్నంతలో ఘనంగా బిడ్డ పెళ్లి చేశారు. ఆమె కూడా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని అంగీకరించి.. పెళ్లి చేసుకుంది. ఇక కోటి ఆశలతో వివాహ బంధంలోకి ప్రవేశించిన ఆమెకు.. నెల రోజుల్లోనే జీవితం మీద అంతులేని విరక్తి కలిగింది. నిండు నూరేళ్లు భర్త, పిల్లాపాపలతో కలిసి సంతోషంగా జీవిస్తుంది అనుకున్న కుమార్తె.. పెళ్లైన నెలకే దారుణ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ వివరాలు..
విశాఖపట్నంలో దారుణం జరిగింది. వివాహమైన నెలకే మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మండలం జమదాలకు చెందిన జాగాన కల్యాణికి.. అదే ప్రాంతానికి చెందిన పెంట రాంబాబుతో గత నెల అనగా అక్టోబర్ 22న తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నూతన దంపతులు.. ఉపాధి నిమిత్తం విశాఖపట్నం వచ్చి 89వ వార్డు చంద్రనగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో రాంబాబు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. కొత్తదంపతులు.. కొత్త సంసారం బాగానేసాగుతోంది. ఇలా ఉండగా దీపావళి పండుగ కోసం దంపతులిద్దరూ ఊరికి వెళ్లారు. ఆతర్వాత తిరిగి చంద్రనగర్ వచ్చారు.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. గురువారం కల్యాణి తన స్వగ్రామానికి వెళ్తానని చెప్పింది. దాంతో రాంబాబు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భార్యను తీసుకొచ్చి సింహాచలం రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కొద్దిసేపటికే ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న విశాఖ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కళ్యాణి తల్లిదండ్రులు, బంధువులు విశాఖకు తరలివచ్చారు.
పెళ్లై ఏడాది కూడా కాకముందే.. విగత జీవిగా మారిన కళ్యాణి మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఆ తర్వాత మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భర్త రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు కల్యాణి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక తల్లిదండ్రులతో మొబైల్‌లో వీడియోకాల్ మాట్లాడి.. ఆ తర్వాత రైలు వస్తుండగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.