తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన విజయవాడ దుర్గ గుడి, సింహాచలం అప్పన్న దేవస్థానం, ద్వారకా తిరుమల దేవాలయాలకు కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా అన్నవరం దేవస్థానానికి పాలక మండలిని నియమించింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు చైర్మన్గా, ప్రధాన అర్చకుడు సభ్యుడుగా మొత్తం […]
ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రముఖ ఆలయాలకు జగన్ సర్కార్ పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ఈ రోజు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున సభ్యులను నియమించారు. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్గా వ్యవహరించనున్నారు. దుర్గ గుడి పాలక మండలి చైర్మన్గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం ఉంది. విజయవాడ: దుర్గ గుడి […]