భర్త మాటలు నమ్మి ఆ వలలో చిక్కుకున్న భార్య!

నేటికాలంలో కొందరు దంపతులు చిన్నపాటి గొడవలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక, సమస్యలు వివాహేతర సంబంధాలు కారణంగా ఎక్కువ హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొందరు తమ భాగస్వామిని నమ్మించి దారుణంగా హత్య చేస్తున్నారు.

నేటికాలంలో కొందరు దంపతులు చిన్నపాటి గొడవలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక, సమస్యలు వివాహేతర సంబంధాలు కారణంగా ఎక్కువ హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొందరు తమ భాగస్వామిని నమ్మించి దారుణంగా హత్య చేస్తున్నారు.

ఈమధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. ఈ క్రమంలో సర్ధుకుని సంసారాన్ని సాగించే వారు కొందరు, సర్థుకోలేక విడిపోయి జీవించే వారు మరికొందరు. అయితే హత్యలకు తెగించే వారు ఇంకొందరు. చిన్నపాటి గొడవలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక, సమస్యలు వివాహేతర సంబంధాలు కారణంగా ఎక్కువ హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొందరు తమ భాగస్వామిని నమ్మించి దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా భర్త మాటలు నమ్మి ఆయన వద్దకు వెళ్లిన మహిళ..చివరకు మృత్యువు వల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అన్నయమ్య జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా  నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను పోలీసులు గుర్తించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని నాగలకట్ట వీధికి చెందిన రంగయ్య, సాలమ్మల కుమార్తె భారతి (26)కి అన్నమయ్య జిల్లా పలమనేరుకు చెందిన గణపతితో వివాహం జరిగింది. వీరి వివాహం తొమ్మిదేళ్ల క్రితం జరగ్గా..చాలా కాలంపాటు సంతోషంగా ఉన్నారు. వీరికి గంగాధర్‌ (6), రోహిత్‌ (4)  అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొంతకాలం తరువాత గణపతి అతని కుటుంబ సభ్యులు భారతిని తరచూ వివిధ రకాల వేధింపులకు గురి చేసేవారు. అలానే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పంచాయితీ చేశారు. అయితే పెద్దల సమక్షంలోనే గణపతి తన భార్యపై దాడి చేశాడు. దీంతో భారతి కుటుంబ సభ్యులు మనస్తాపం చెంది.. ఆమెను తమ ఊరికి తీసుకెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి భారతి తన పుట్టింటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం పెనుమూరు మండలం కార్తికేయపురంలో ఉన్న తన పిన్ని జ్యోతి వద్దకు భారతి వచ్చింది. అక్కడ ఆమె నెల్లూరుకు చెందిన రవితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిద్దరి మధ్య మంచి సన్నిహితాన్నికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే నెల రోజుల కిందట రవితో కలిసి భారతి వెళ్లిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న భారతి భర్త.. ఈ నెల 27న ఆమెకు ఫోన్‌ చేశాడు. తాను బిడ్డలను తాను పోషించలేనని వచ్చి తీసుకెళ్లాలని భారతిని నమ్మించాడని స్థానికులు భావిస్తున్నారు. ఇక బిడ్డలపై ఉన్న ప్రేమతో గణపతి మాటలు నమ్మిన భారతి..బిడ్డలను తీసుకెళ్లేందుకు గురువారం పలమనేరు వెళ్లింది. వీరిద్దరు కలసి దివిటివారిపల్లె వద్ద ఉన్న బాహుదా నది వద్ద కాసేపు గడిపారు. ఈ క్రమంలోనే గణపతి ముందుకా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. భారతిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పొలానికి నీరు కట్టేందుకు వచ్చిన రామాంజులు అనే వ్యక్తి హత్య చూడటంతో అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ దాడిలో గాయపడిన రామాంజులును కుటుంబ సభ్యులు తిరుపతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి సాలమ్మ, తమ్ముడు మునికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments