బిర్యానీలో విషం కలుపుకుని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?

కొత్త సంవత్సరం వేళ ఓ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ బాధను భరించలేక ఆ ఇంటి యజమాని తన భార్యాబిడ్డలకు బిర్యానీలో విషం కలిపి తినిపించి ఆ తర్వాత తాను తిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

కొత్త సంవత్సరం వేళ ఓ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ బాధను భరించలేక ఆ ఇంటి యజమాని తన భార్యాబిడ్డలకు బిర్యానీలో విషం కలిపి తినిపించి ఆ తర్వాత తాను తిన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రస్తుత రోజుల్లో ఆదాయాలు తక్కువ.. ఖర్చులు ఎక్కువ. ఇంటి ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం సంపాదించిన సంపాదన సరిపోవడం లేదు. ఈ కారణం చేత ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో కుటుంబ అసరాలను తీర్చుకునేందుకు అప్పులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. దీంతో కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. భారానికి మించి అప్పులు చేయడంతో అవి తీర్చలేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ కుటుంబం అప్పుల బాధకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిర్యానీలో విషం కలుపుకుని ఊపిరి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘోర ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

శక్తికి మించి అప్పులు చేయడం ఆ తర్వాత వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇటువంటి సంఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ఆరని నిప్పు.. తీరని అప్పు ఎప్పుడైనా ప్రమాదమే. నెల్లూరు జిల్లాలోని కావలిలో ఓ కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడింది. కొత్త సంవత్సరం వేళ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలంరేగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్‌లో ఎండ్లూరి భాస్కర్‌ భార్య చిన్నమ్మ, అవినాష్‌ (11), దీపిక (8) కలిసి నివసిస్తున్నారు. భాస్కర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా దాని ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలను తీర్చలేకపోతోంది. దీంతో అప్పులు తీసుకోవడంపై ఆదారపడ్డారు.

అలా కొంతకాలానికి అప్పులు ఎక్కువయ్యాయి. తీసుకున్న అప్పులను ఎలా తీర్చాలో భాస్కర్ కు అర్ధం కాలేదు. సమాజంలో పరువుపోతుందని భావించిన భాస్కర్ అతని భార్య పిల్లలకు బిర్యానీలో విషం కలిపి తినిపించాడు. అనంతరం తానూ తిన్నాడు. కాసేపటి తర్వాత వాళ్లంతా వాంతులు చేసుకున్నారు. దీనిని గుర్తించిన స్థానికులు.. వెంటనే వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి అప్పుల భారంతో కుటుంబమంతా ఆత్మహత్యయత్నానికి పాల్పడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments