Krishna Kowshik
ప్రేమను పండించుకోవాలని ఎంతో మంది లవర్స్ ఎన్నో పాట్లు పడుతుంటారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోతే చిన్నపాటి నిరాహర దీక్ష చేపడతారు. కానీ ఈ ఆదర్శ దంపతులు మాత్రం..
ప్రేమను పండించుకోవాలని ఎంతో మంది లవర్స్ ఎన్నో పాట్లు పడుతుంటారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోతే చిన్నపాటి నిరాహర దీక్ష చేపడతారు. కానీ ఈ ఆదర్శ దంపతులు మాత్రం..
Krishna Kowshik
ప్రేమికులు తన ప్రేమను పండిచుకోవడానికి అష్టకష్టాలు పడుతుంటారు. పెద్దల కంట్లో పడకుండా ప్రేయసిని లేదా ప్రియుడ్ని కలిసేందుకు వెళుతుంటారు. ఇక సెల్ ఫోన్ ముద్దు ముచ్చట్లకు అంతుపొంతు ఉండదు. తల్లిదండ్రుల కళ్లు గప్పి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. తమ ప్రేమ గురించి ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. పెద్దలకు తెలిసి కాదంటే.. చిన్నపాటి నిరాహర దీక్ష చేస్తారు. ఏడుపులు, పెడబొబ్బలు, ఇల్లు పీకి పందిరి వేస్తుంగటారు. పేరెంట్స్ ఒప్పుకునేంత వరకు ఎవ్వరితో మాటలు ఉండవు. తిండి, నిద్రకు స్వస్థి పలుకుతూ మొండిగా వ్యవహరిస్తుంటారు. తల్లిదండ్రులు ఒప్పుకుంటే సరే సరి లేకుంటే తీవ్ర నిర్ణయాలకు ఒడిగడుతుంటారు. పిల్లల సంతోషం తమకు ముఖ్యమని భావించే పెద్దలు.. పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక్కడితో సినిమా కథ ముగుస్తుంది కానీ.. రియల్ లైఫ్ అక్కడే స్టార్ అవుతుంది.
అయితే ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎన్నో జంటలు కొన్ని సంవత్సరాలకే విడిపోతున్నాయి. లేదంటే దారుణ నిర్ణయాలకు దిగుతున్నాయి. పెళ్లికి ముందు ఉండే ప్రేమ, వివాహం అయ్యాక కనబడం లేదంటూ గొడవలు పడుతూ డివోర్స్ తీసుకుంటారు. అయితే ఈ ఆదర్శ జంట మాత్రం తీరు వేరు. పెళ్లై 24 గంటలు గడవకముందే గొడవలు పడి ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని.. చంపుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని బైనపల్లికి చెందిన లిఖితశ్రీ, కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకాలోని చంబరసనహళ్లి ప్రాంతానికి చెందిన నవీన్.. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లిల్లో ఈ జంటను చూసి ఎంతో చూడముచ్చటగా ఉందని అనుకున్నారు వివాహానికి వచ్చిన వారంతా. జంటను ఆశీర్వదించారు.
వివాహ తంతు ముగిసింది. ఇద్దరు కలిసి ఎన్నో ఫోటోలు దిగారు. తమ ప్రేమ బంధం, పెళ్లిగా మారిందని సంబంరపడిపోయారు. అంతలో ఇద్దరు కలిసి రూంలోకి వెళ్లారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. కాసేపటికి ఇద్దరు గదిలో రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. ఏదో విషయంపై గొడవ పడ్డ ఇద్దరు కత్తులతో ఒకరినొకరు పొడుకుకున్నారు. కుటుంబ సభ్యులను వారిని చూసి ఖంగుతిన్నారు. హుటాహుటిన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరణంలోనూ ఇద్దరు ప్రేమికులమని నిరూపించుకున్నారు.. కానీ నిజ జీవితంలో ప్రేమ, పెళ్లి ఇచ్చిన ఆనందాన్ని సార్థకత చేసుకోలేకపోయారు. ఈ ఘటన ఏపీలో కూడా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.