iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు విదేశాల్లో లక్షల్లో జీతం.. ఇప్పుడు రోడ్డు మీద.. ?

  • Published Nov 28, 2024 | 4:21 PM Updated Updated Nov 28, 2024 | 4:21 PM

పెరిగిన జుట్టు, మాసిన గడ్డం , చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా రోడ్లపై తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. అందులో ట్రెండ్ అయ్యే న్యూస్ ఏముంది.. అలాంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు కదా అనుకుంటే పొరపాటే. అతను ఒకప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అట. లక్షల్లో జీతం , సూటు బూటు వేసుకుని ఎసి కింద కంప్యూటర్ లో ఉద్యోగం.. చాలా హుందాగా బ్రతికిన జీవితం అతనిది. కట్ చేస్తే ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతున్నాడు.

పెరిగిన జుట్టు, మాసిన గడ్డం , చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా రోడ్లపై తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. అందులో ట్రెండ్ అయ్యే న్యూస్ ఏముంది.. అలాంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు కదా అనుకుంటే పొరపాటే. అతను ఒకప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అట. లక్షల్లో జీతం , సూటు బూటు వేసుకుని ఎసి కింద కంప్యూటర్ లో ఉద్యోగం.. చాలా హుందాగా బ్రతికిన జీవితం అతనిది. కట్ చేస్తే ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతున్నాడు.

  • Published Nov 28, 2024 | 4:21 PMUpdated Nov 28, 2024 | 4:21 PM
ఒకప్పుడు విదేశాల్లో లక్షల్లో జీతం.. ఇప్పుడు రోడ్డు మీద.. ?

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. పెరిగిన జుట్టు, మాసిన గడ్డం , చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా రోడ్లపై తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. అందులో ట్రెండ్ అయ్యే న్యూస్ ఏముంది.. అలాంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతను చూడడానికి బిచ్చగాడిలానే ఉన్నా ఇంగ్లీష్ లో నాన్ స్టాప్ గా దంచేస్తున్నాడు. ఏ మాత్రం తడబడకుండా చాలా స్పష్టంగా అదరగొడుతున్నాడు. ఎంతో మంది సైంటిస్ట్ ల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్తున్నాడు. ఫిలోసఫి, మెడిటేషన్ , యోగ ఇలా అన్నిటి గురించి చాలా బాగా చెప్తున్నాడు. ఏంటా అని ఓ యువకుడు ఆరా తీస్తే అప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. అతను ఒకప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అట. లక్షల్లో జీతం , సూటు బూటు వేసుకుని ఎసి కింద కంప్యూటర్ లో ఉద్యోగం.. చాలా హుందాగా బ్రతికిన జీవితం అతనిది. కట్ చేస్తే ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతున్నాడు. ఇది నిజమా ఇలా ఎందుకు జరుగుతుంది అసలు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏంటి.. ఇలా రోడ్లపై బిచ్చం ఎత్తుకోవడం ఏంటి.. అని ఆరా తీయగా తెల్సిందేంటంటే..

అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉద్యోగం చేసేవాడట. ఆ తర్వాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గా వర్క్ చేశాడట. ఆ తర్వాత కొంతకాలానికి అతని తల్లి తండ్రులు చనిపోవడంతో మద్యానికి బానిస అయ్యాడట ఆ వ్యక్తి. ఇక అప్పటినుంచి కూడా ఉద్యోగం కోల్పోయి.. ఇలా రోడ్ల మీద తిరుగుతున్నట్లు తెలిసింది. ఏసీ రూముల్లో ఉంటూ లక్షల్లో జీతం తీసుకోవాల్సిన వ్యక్తి.. ఇప్పుడు కేవలం మద్యానికి బానిస అవ్వడం వలన అదే నగరంలో రోడ్లపై బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విశేషం ఏంటంటే అతనికి ఇంకా చావుకోవాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ వీడియో తీసే వ్యక్తి సాయం చేస్తానని చెప్పినా కూడా దానికి అతను నిరాకరించినట్లు తెలుస్తుంది. అతనిని చూసి NGO లను సంప్రదించినా కూడా.. కేవలం పోలీసుల ప్రమేయం ఉంటేనే అతనిని మార్చడం సాధ్యం అని డాక్టర్స్ చెప్పారట. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అంత ఉన్నత చదువులు చదువుకుని.. చివరికి ఇలా రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవడంతో వీడియో చూసిన వారు షాక్ అయ్యారు. ఎంతో మంది హృదయాలను కదిలించాయి అతని మాటలు. అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వస్తాం అన్నవారు కూడా ఉన్నారు. మరి అతని జీవితానికి ఎవరైనా దారి చూపిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఒక అలవాటుకు బానిస అయితే ఎంత పై స్థాయిలో ఉన్నా చివరికి ఇలాంటి పరిస్థితులు తప్పవని.. మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.