దేవుడి మహిమ.. 100 ఏళ్ల నాటి విగ్రహాన్ని దొంగిలించి తిరిగిచ్చిన దొంగ..!

అతడో పేరు మోసిన దొంగ. దేవాలయాల్లో విగ్రహాలను కొట్టేయడం అలవాటు. అలా ఎంతో ప్రాచీనమైన, మహమాన్విత విగ్రహాన్ని దొంగిలించాడు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ చివరకు దొంగే తిరిగి తీసుకువచ్చాడు. ఎందుకంటే..?

అతడో పేరు మోసిన దొంగ. దేవాలయాల్లో విగ్రహాలను కొట్టేయడం అలవాటు. అలా ఎంతో ప్రాచీనమైన, మహమాన్విత విగ్రహాన్ని దొంగిలించాడు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ చివరకు దొంగే తిరిగి తీసుకువచ్చాడు. ఎందుకంటే..?

ప్రాచీనమైన, మహిమ గల రాధా కృష్ణుల విగ్రహం దొంగతనానికి గురైంది. విగ్రహం పోవడంతో ప్రధాన పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహం పోవడంతో పూజారీ, ఇతర సేవకులు కుంగిపోయారు. తిండి, తిప్పలు మానేసి ఆందోళనలో కూరిపోయారు. ఈ నెల 1వ తేదీ సాయంత్రం గుడి బయట ఓ గోనె సంచిని వదిలిపెట్టి పరిగెతుడున్న వ్యక్తిని గమనించారు స్థానికులు. తొలుత అందులో ఏముందో అని ఖంగారు పడ్డారు. చివరకు ధైర్యం చేసి చూడగా.. అందులో తళతళ మెరుస్తున్న రాధా కృష్ణుల విగ్రహం కనిపించింది. ఆలయ పూజారీకి, పోలీసులకు సమాచారం అందించారు. ఆలయానికి చేరుకున్న పూజారీ.. విగ్రహంతో పాటు లేఖను ఉండటం చూశాడు. తీసి చూడగా.. దొంగ లేఖ రాసినట్లు గుర్తించారు. ఇంతకు ఆ విగ్రహం ఎందుకు దొంగిలించినట్లు, ఎందుకు వదిలేసినట్లు.. ఆ క్షమాపణ లేఖలో ఏముందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాధాకృష్ణుల ఎంతో ప్రసిద్ది. ఈ ఆలయంలో 100 ఏళ్ల నాటి రాధా కృష్ణుల విగ్రహం ఉంది. బంగారం, వెండి, రాగి, సీసం, జింక్, తగరం, ఇనుములతో తయారు చేసిన ఈ మహిమాన్విత విగ్రహం గత నెల 23న చోరీకి గురైంది. ఆలయం తలుపులు పగులగొట్టి రాధా కృష్ణుల విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఆలయ ప్రధాన పూజారీ జయరామ్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన దొంగ కోసం వెతకసాగారు. అయితే ఈ మంగళవారం సాయంత్రం ఆలయానికి సమీపంలో గోనె సంచెలో విగ్రహాన్ని వదిలేసి పారిపోయాడు దొంగ. స్థానికులు పూజారీకి సమాచారం ఇవ్వడంతో వచ్చి చూడగా.. విగ్రహంతో పాటు క్షమాపణలు కోరుతూ లేఖ రాశాడు.

అందులో ‘నేను క్షమించలేని పెద్ద తప్పు చేశాను.. ఈ విగ్రహం దొంగిలించినప్పటి నుండి నాకు పీడ కలలు వస్తున్నాయి. సరైన తిండి తినలేకపోయాను, ప్రశాంతంగా నిద్రకూడా పోలేదు. నా కొడుకు, భార్య కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాస్తంత సొమ్ముల కోసం ఈ దొంగతనం చేశాను. అమ్మాలనే ఉద్దేశంతో విగ్రహానికి మెరుగులు అద్దాను. కానీ ఆ రోజు నుండి నేను నిద్రపోలేదు. పీడకలలు వెంటాడాయి. దీంతో తిరిగి విగ్రహాన్ని ఇవ్వాలనుకుంటున్నా. నేను చేసిన తప్పును క్షమించండి. ఆలయంలో భగవంతుని స్థానాన్ని పునరుద్ధరించాలని నేను వేడుకుంటున్నా. దయచేసి ఈ విగ్రహాలను స్వీకరించండి. నా భార్యా బిడ్డలను క్షమించండి’ అంటూ రాసుకొచ్చాడు.

కాగా, ఈ విగ్రహం తిరిగి తీసుకురావడంతో దేవాలయ సిబ్బందితో పాటు భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విగ్రహానికి జలాభిషేకం చేసి, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి.. తిరిగి అదే గర్బగుడిలో ప్రతిష్టాపన చేశారు. అయితే.. దొంగతనం తర్వాత దేవుడ్ని ప్రార్థించానని, ఆ దేవుడే కరుణించాడని ప్రధాన పూజారీ పులకరించిపోయారు. కాగా, ఇదంతా ఆ దేవుడి లీలే అని, లేకుంటే చోరీకి గురైన విగ్రహాలు దొరకడమేమిటీ అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు స్థానికులు, భక్తులు.  ఆ భగవంతుడి కరుణ కటాక్షాల వల్లే విగ్రహాలు తిరిగి వచ్చాయంటున్నారు. మరీ ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments