Phonepe, Gpay యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్

Gpay, PhonePe: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు ఆ సమస్యలన్నీ తీరనున్నాయి. పూర్తి వివరాలు మీకోసం..

Gpay, PhonePe: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు ఆ సమస్యలన్నీ తీరనున్నాయి. పూర్తి వివరాలు మీకోసం..

డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక పేమెంట్ విధానమే మారిపోయింది. చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం అయిపోయింది. చేతిలో నగదు లేకున్నా కూడా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసే సౌకర్యం ఏర్పడడంతో కిరాణా షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అంతా ఆన్ లైన్ లోనే పేమెంట్ చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వేల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో యూజర్లకు మెరుగైన సేవల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఆ సమస్యలు తీరనున్నాయి.

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు ఫోన్ పే, గూగుల్ పేలను యూజ్ చేస్తున్నారు. అయితే పేమెంట్ చేసే సమయంలో ఒక్కోసారి డబ్బులు ఒకరికి పంపబోయి మరొకరికి పంపుతుంటారు. తెలిసిన వారికి పంపిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. తిరిగి మళ్లీ పంపించమని అడగొచ్చు. అదే తెలియని వ్యక్తులకు పంపిస్తే మాత్రం డబ్బులు తిరిగి పొందేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చేసే చెల్లింపుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు యూజర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్బీఐ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకొచ్చింది. ఈ నెంబర్ తో పొరపాటున పంపించిన డబ్బును ఈజీగా తిరిగి పొందొచ్చు.

ఆర్బీఐ 18001201740 టోల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెట్టింది. పేమెంట్ చేసే సమయంలో చూసుకోకుండా వేరొకరికి పంపించినప్పుడు ఈ నెంబర్ కు కాల్ చేసి సమస్యను తెలిపితే త్వరగా పరిష్కారం లభిస్తుంది. మీకు ఎప్పుడైన ఈ సమస్య ఎదురైనప్పుడు ఆర్బీఐ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదు అందుకున్న 48 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది. యూపీఐ మోడ్ లో పేమెంట్ చేసేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. నేరుగా బ్యాంకులను సంప్రదించి కూడా డబ్బును తిరిగి పొందొచ్చు. కానీ దీనికి కొంత సమయం ఎక్కువ పడుతుంది.

Show comments