ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్.. కస్టమర్లకు త్వరలో లోన్స్!

ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్. డిజిటల్ పేమెంట్స్ లో దూసుకెళ్తున్న ఫోన్ పే తన కస్టమర్ల కోసం కన్య్సూమర్ లోన్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇకపై ఫోన్ పే ద్వారా కస్టమర్లు లోన్స్ పొందొచ్చు.

ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్. డిజిటల్ పేమెంట్స్ లో దూసుకెళ్తున్న ఫోన్ పే తన కస్టమర్ల కోసం కన్య్సూమర్ లోన్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే ఇకపై ఫోన్ పే ద్వారా కస్టమర్లు లోన్స్ పొందొచ్చు.

ప్రస్తుతం అన్నిరకాల పేమెంట్స్ ను డిజిటల్ రూపంలోనే చేస్తున్నారు. చిన్న చిన్న దుఖానాల దగ్గర్నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్ వరకు ఆన్ లైన్ పేమెంట్స్ వైపే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలను విరివిగా వాడేస్తున్నారు కస్టమర్లు. ఎప్పుడంటే అప్పుడు లావాదేవీలు చేసుకునేందుకు వీలుగా ఉండడంతో ఆన్ లైన్ పేమెంట్స్ కు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో ఫోన్ పే కస్టమర్లకు శుభవార్తను అందించింది. త్వరలో లోన్స్ అందించేందుకు సిద్దమవుతోంది. దీంతో ఫోన్ పే యూజర్లకు లావాదేవీలకే కాకుండా లోన్స్ కూడా సౌలభ్యం కలుగనున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కోట్లాది మంది యూజర్లను కలిగిన ఆన్ లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే కన్స్యూమర్ లోన్స్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లకు లోన్స్ అందించేందుకు ఐదు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024 జనవరి వరకు ఫోన్ పే కన్స్యూమర్ రుణాలను అందుబాటులోకి తీసుకు రావొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే కస్టమర్లు పర్సనల్ లోన్స్ తో పాటు వినియోగదారుల రుణాలు కూడా పొందే అవకాశం కలిగినట్లైతది. దీని కోసం ఫోన్ పే లెండర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఫోన్‌పే లోన్ సర్వీసులు అందిస్తోంది. అయితే ఈ సర్వీసుల ఫోన్ పే ద్వారా డైరెక్ట్ గా కాకుండా లెండింగ్ సంస్థల ద్వారా మాత్రమే లోన్ తీసుకునే వీలుంటుంది. అయితే ఇకపై ఇలా కాకుండా తన ప్లాట్‌పామ్ ద్వారానే పలు బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా లోన్స్ జారీ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాగా 2016లో ప్రారంభమైన ఫోన్ పే కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్నది. 50 కోట్ల యూజర్లు, 3.7 మర్చంట్స్ సంఖ్యతో ఫోన్ పే డిజిటల్ పేమెంట్స్ లలో దూసుకెళ్తోంది.

Show comments