P Venkatesh
Microsoft: ప్రముఖ టెక్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫీసుల్లో ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లను వాడకూడదని తెలిపింది. కేవలం ఐఫోన్లు మాత్రమే వినియోగించాలని కోరింది.
Microsoft: ప్రముఖ టెక్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫీసుల్లో ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లను వాడకూడదని తెలిపింది. కేవలం ఐఫోన్లు మాత్రమే వినియోగించాలని కోరింది.
P Venkatesh
స్మార్ట్ ఫోన్ వాడకం అనేది తప్పనిసరి అయిపోయింది. ఎక్కువ మంది యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్లనే కలిగి ఉంటారు. ఐఫోన్లను వాడే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎందుకంటే వీటి ధరలు ఎక్కువ కాబట్టి. కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ తో పోల్చితే ఐ ఫోన్ లో భద్రతాపరమైన ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఐ ఫోన్లలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లతో ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉండొచ్చు. అయితే ప్రపంచంలో దిగ్గజ టెక్ కంపెనీ అయిన మైక్రో సాఫ్ట్ సంచనల నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆఫీసుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను వాడకూడదని తెలిపింది. కేవలం ఐ ఫోన్లను మాత్రమే వాడాలని సూచించింది. ఇంతకీ ఇది ఎక్కడంటే?
మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. చైనాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే వినియోగించాలని తెలిపింది. ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లను వాడకూడదని సూచించింది. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. దీనికి గల కారణం ఏంటంటే? చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేవు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్‌ఫామ్ కలిగి ఉన్నాయి. ఈ కారణంతో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కంపెనీ భావించినట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఫీచర్లకు మారుపేరైన ఐఫోన్లను మాత్రమే ఆఫీసుల్లో వాడాలని తెలిపింది. దీంతో డేటాకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్‌వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లలో కొత్త అనుమానాలకు తెరలేపినట్లు అయ్యింది. మరి ఆఫీసుల్లో ఐఫోన్లను మాత్రమే వాడాలన్న మైక్రోసాఫ్ట్ ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.